గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జులై 2022, శనివారం

ఏతాం విభూతిం యోగం చపో...10 - 7...//... అహం సర్వస్య ప్రభవోర్వే...10 - 8,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్.

|| 10-7 ||

శ్లో.  ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః|

సోవికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః.

తే.గీ. నాదు విభూతి యోగమున్ మోదమలర

నసలు తత్వంబు నర్మిలి నరయువారు

నిశ్చలంబగు యోగాన నిలిచిపోదు

రిందు సందేహమే లేదదెప్పటికిని.

భావము.

ఈ నా విభూతి యోగాన్ని అసలు తత్వములో తెలుసుకున్నవాడు, 

చలించని యోగంలో నిలిచి పోతాడు. ఇందులో సందేహము లేదు.

 || 10-8 ||

శ్లో.  అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే|

ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితాః.

తే.గీ.  సృష్టి మూలము నేనని దృష్టిపెట్టి 

నన్ను కొలుతురు భక్తులు మిన్నగాను,

నేనె జగతిని నడుపుటన్ జ్ఞానులు కను

కాన నన్నే భజింతురు నయము దలర.

భావము.

నేను అన్నిటి పుట్టుకకి హేతువుని. నా వలననే సమస్తమూ 

నడుస్తుందని తెలుసుకున్న వివేకులు భక్తి పూరితులై నన్ను సేవిస్తారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.