గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, సెప్టెంబర్ 2017, శనివారం

వృద్ధార్కో హోమ ధూమశ్చ,్ . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. వృద్ధార్కో హోమ ధూమశ్చ, బాలా స్త్రీ నిర్మలోదకమ్
రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిర్దినే దినే.
గీ. అస్తమించెడి రవి కాంతి, హవన ధూమ
మమరు చినదాని కలయిక, యమల జలము,
నిశను క్షీరన్న భుక్తియు వసుధ జనుల
కాయువును వృద్ధి చేయును, శ్రేయమొసగు.
భావము. సాయంకాల సూర్య రశ్మి,  హోమ ధూమము, తనకంటే చిన్నదైన స్త్రీ సంగమము, నిర్మలమైన నీరు,రాత్రివేళలో క్షీరాన్నము భుజించుట, అనునవి క్రమముగా ఆయుర్వృద్ధి కలిగించును.
జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్లోకం చాలా బాగుంది కానీ , మరి.....స్త్రీల ఆయుర్వృద్దికి శ్లోకం ఏమి లేదా ? [ క్షమించాలి తమాషాకి ]

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్యా! ఇక్కడ స్త్రీ పురుష భేదము లేదు. ఉభయులకు ఆయుర్వృద్ధి కలుగునని తెలియవలయును. నమస్తే.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanya vaadamulu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.