జైశ్రీరామ్.
మంత్రమ్. గణానామ్ త్వా గణపతిగ్ం హవామహేకవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్.
చం. గణములలో సదా పతివి.గౌరవమొప్పఁగ పిల్చితేను నిన్.
ఘనముగ నే హవిస్సులను కామ్యద! అర్పణ చేతు నీకిలన్
ఘన కవి రాజిలో కవివి. గణ్యుఁడవీవెగ కీర్తి శ్రేష్టులన్.
ఘనుఁడవు రాడ్వరుండవు. ప్రగణ్య మహీసుర శ్రేష్టుఁడీవె. సద్
వినయముతోడ రమ్మనుదు. వేల్పుగ పీఠమలంకరింపుమా!
భావము. గణాలలో నీవు గణపతివి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. హవిస్సులర్పిస్తున్నాను.
కవులలో కవివి (మహాభారతం రచించినవాడివి) అందరిలో పోల్చవలసిన కీర్తిశ్రేష్ఠులలో కూడా
నీవే శ్రేష్ఠుడవు. రాజులకు జ్యేష్ఠుడవు, బ్రాహ్మణులలో గొప్ప బ్రాహ్మణుడవు. వచ్చి సుఖాసనంలో
కూర్చుని మా కోరికలు వినుము.
జైహింద్.
1 comments:
నమస్కారములు
ముందుగా స్మరించ వలసినది గణపతి దేవుని మంత్రమేగా చాలా బాగుంది. ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.