జైశ్రీరామ్.
"ఉభయభాషాద్విగుణీకృత అష్టావధానం" అన్న ప్రక్రియ అమెరికాలో మొట్టమొదటి సారిగా జరిగి చరిత్ర సృష్టించనున్నది. సంస్కృతంలోనూ తెలుగులోనూ ఏకకాలంలో 16 మంది పృఛ్ఛకులతో అష్టావధానాలు చేయడం ఈ ప్రక్రియలోని విశిష్టత. ఇంకా ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ అవధాని కూడా ఒక అమెరికా పౌరుడే అయి ఉండటం.
తేది: సెప్టెంబర్ 10, 2017, ఆదివారం
సమయము: మధ్యాహ్నం 2-00 నుంచి 5-00 వరకు
ప్రదేశము: Swagat Indian Restaurant, 68 S Abel St, Milpitas, CA 95035
అవధాని: అమెరికా పౌరులైన తెలుగు సోదరులు శ్రీ పాలడుగు శ్రీచరణ్
అధ్యక్షులు: శ్రీ రావు తల్లాప్రగడ
పృచ్ఛకులు:
సంస్కృతానికి– శ్రీ మారేపల్లి నాగవెంకటశాస్త్రి,
శ్రీ విశ్వాస్ వాసుకి,
శ్రీ హరి కృష్ణమూర్తి,
శ్రీ పిల్లలమర్రి కృష్ణకుమార్,
శ్రీమతి సంధ్యా వాషీకర్,
శ్రీమతి మాజేటి సుమలత,
శ్రీ హరినారాయణ
తెలుగుకు –
శ్రీ పుల్లెల శ్యాంసుందర్,
శ్రీ హరి కృష్ణమూర్తి,
శ్రీ మొహమ్మద్ ఇక్బాల్,
శ్రీ తల్లాప్రగడ రావు,
శ్రీ కొండూరు రవిభూషణ్ శర్మ,
శ్రీ రెంటచింతల చంద్ర,
శ్రీ ఆసురి వేణు,
శ్రీమతి గీతామాధవి.
సన్మానం: మహాంధ్ర భారతి సౌజన్యం
అమెరికాలో ప్రప్రథమంగా జరుగుతున్న ఈ చారిత్రక కార్యక్రమంలో మీరందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.
సీ. శ్రీకరుండైనట్టి శ్రీ పాలడుగు శ్రీచ - రణ్ మహత్ విజ్ఞాన ప్రాభవమున
సంస్కృతాంధ్రములందు సదవధానద్వయ - మొక్కటై యొనరె నహో యనంగ.
తల్లాప్రగడ రావు దానికధ్యక్షులై - ముందుకు నడుపఁగ ముచ్చటగను.
నయత మారేపల్లి నాగవెంకటశాస్త్రి, - విశ్వాసు వాసుకి, వెలుఁగు నింప,
పూజ్యులౌ హరి కృష్ణ మూర్తి, పిల్లలమర్రి - కృష్ణకుమార్, సంధ్య తృప్తిఁ గనఁగ,
మాజేటి సుమలత, మహిత నారాయణ, - శ్రీకర సంస్కృత పృచ్ఛకులవ,
పుల్లెల శ్యాంసుందరుల్లముల్ పొంగింప,- హరి కృష్ణమూర్తి స్నేహార్ద్రతఁ గన,
మొహమదిక్బాల్, రావు, మహిత కొండూర్ శర్మ,- రెంటచింతల చంద్ర, ప్రేమఁ జూప,
తే.గీ. మాన్యు లాసురి వేణు, సన్మాధవియును.
తెలుగు పృచ్ఛకులై వెల్గ దిక్తటులను
మారు మ్రోగఁగ వినుత సంభాసమాన
సదవధానద్వయంబట సాగుఁ గాత!
* * * * *
శ్రీమాన్! తల్లాప్రగడ రావు గారూ! నమస్తే.
అవధాన కార్యక్రమ నిర్వాహకులకు,
మీకు,
శ్రీమాన్ అవధానివరేణ్యులకు,
సంస్కృతాంధ్ర పృచ్ఛకాళికి
నా హృదయ పూర్వక అభినందనలు తెలియఁ జేస్తున్నాను.
అవధాన సమయమున
అవధాని నోట సరస్వతీ చరణ కింకిణుల సవ్వడి
దిగంతములవరకు మారుమ్రోగాలని
మనసారా కోరుకొంటున్నాను.
శుభమస్తు.
భవదీయుఁడు
చింతా రామకృష్ణారావు.
ఆంధ్రామృతం బ్లాగు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవధానము నందు పాల్గొనుచున్న అదృష్ట వంతులందరికీ శుభాభి నందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.