జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు మన తల్లి స్కందమాతగా మనలను కటాక్షించుచున్నది.
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.
స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.
ఈ తల్లి మిమ్ములను చల్లగా చూచుగాక.
స్కందమాత
( లలిత )
శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు
సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||
నదీ వృత్త గర్భ సీసము. (నదీవృత్తము. న న త జ గగ .. యతి 8 )
నిలు
మదిని,
జయము గొలుపుమో సన్నుత - స్కందమాతా! నన్నుఁ
గాంచవమ్మ!
పలుకుల
వినయము నిలుపుమానందద - నవ్య తేజా! నిన్ను నమ్మి కొలుతు.
వెలుఁగ
మది శ్రియము కలుగనీ జీవిత - మంత నాకున్ మదిన్ భ్రాంతి తీర.
ఎలమినిడిభయము
తొలగనీ పాప వి - ముక్తుఁ జేయన్ ననున్ బ్రోచు తల్లి!
తే.గీ.
నీదు భక్తుల కోరికల్ నీవె కాక
తీర్చ
నెవ్వరు కలరమ్మ? తీర్చుమమ్మ.
కరుణ
చూపుచు ప్రజనెల్ల కావుమమ్మ.
శరణు
శరణమ్ము జనయిత్రి శరణు శరణు.
సీస
గర్భస్థ నదీ వృత్తము. (న న త జ గగ .. యతి 8)
జయము
గొలుపుమో సన్నుత స్కందమాతా!
నయము
నిలుపుమానందద నవ్య తేజా!
శ్రియము కలుగనీ జీవితమంత నాకున్
శ్రియము కలుగనీ జీవితమంత నాకున్
భయము
తొలగనీ పాప విముక్తుఁ జేయన్.
నైవేద్యం : పెరుగు అన్నము.
జైహింద్.
2 comments:
తెలుగు టైపు చేయడం నేర్చుకోండి కేవలం 1 గంట లో https://www.youtube.com/watch?v=bB3UXcroNV4
నమస్కారములు
స్కందమాత శ్రీ లలితాదేవికి శతవందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.