జైశ్రీరామ్.
శ్లో. వృద్ధార్కో హోమ ధూమశ్చ, బాలా స్త్రీ నిర్మలోదకమ్రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిర్దినే దినే.
గీ. అస్తమించెడి రవి కాంతి, హవన ధూమ
మమరు చినదాని కలయిక, యమల జలము,
నిశను క్షీరన్న భుక్తియు వసుధ జనుల
కాయువును వృద్ధి చేయును, శ్రేయమొసగు.
భావము. సాయంకాల సూర్య రశ్మి, హోమ ధూమము, తనకంటే చిన్నదైన స్త్రీ సంగమము, నిర్మలమైన నీరు,రాత్రివేళలో క్షీరాన్నము భుజించుట, అనునవి క్రమముగా ఆయుర్వృద్ధి కలిగించును.
జైహింద్.
3 comments:
నమస్కారములు
శ్లోకం చాలా బాగుంది కానీ , మరి.....స్త్రీల ఆయుర్వృద్దికి శ్లోకం ఏమి లేదా ? [ క్షమించాలి తమాషాకి ]
అక్కయ్యా! ఇక్కడ స్త్రీ పురుష భేదము లేదు. ఉభయులకు ఆయుర్వృద్ధి కలుగునని తెలియవలయును. నమస్తే.
dhanya vaadamulu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.