గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, నవంబర్ 2014, శుక్రవారం

ప్రతివాదినీ చ భార్యా ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. ప్రతివాదినీ చ భార్యా
పరసేవా పరగృహే సదా భుక్తిః
క్షిప్రం జరయతి పురుషం
నీచైర్వాసః ప్రవాసశ్చ. 
గీ. పత్ని ప్రతికూలవతియౌట, పరుల సేవ, 
పర గృహంబున భుక్తియు, పాలసులగు
వారితోబ్రతుకుగడుపువారిలిలను
వృద్ధులగుదురు పిననాడె వింతగాను.
భావము. ప్రతి మాటకూ అడ్డుచెప్పే భార్య ఉన్నను, పరులను సేవించుచు జీవనము సాగించుచున్నను, పరుల యింట నిత్యము భోజనము చేయుచు జీవించుచున్నను,  నీచులతో సహవాసము చేయుచున్నను, వాసమూ, అట్టివారిని చిన్న వయసులోనే ముసలితనము ఆవరించును. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.