గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, నవంబర్ 2014, బుధవారం

గర్జతి శరది న వర్షతి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. గర్జతి శరది న వర్షతి
వర్షతి వర్షాసు నిస్స్వనో మేఘః
నీచో వదతి న కురుతే
న వదతి సుజనః కరోత్యేవ.
గీ. ఉరుము మేఘము వర్షము కురియఁబోవు.
ఉరుమకుండనె వర్షంబు కురియు కొన్ని.
పలుకులాడెడి నీచులు పనికి రారు.
పనిని చేతురు మహితులు, పలుకబోరు. 
భావము. శరత్కాలంలో మేఘం ఊరికే గర్జిస్తుంది. వర్షాకాలంలో చప్పుడు చేయకున్నా వర్షిస్తుంది. నీచుడు మాటలు చెప్తాడు కానీ పని చెయ్యడు. సుజనుడు మాటలు చెప్పడు, చేసి చూపుతాడు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.