జైశ్రీరామ్.
శ్లో. అవిధేయో భృత్యజనఃశఠాని మిత్రాణి నిర్దయః స్వామీ
వినయరహితా చ భార్యా
మస్తకశూలాని చత్వారి.
గీ. మాట విననట్టి పనివాడు, మదిని మెలగి
మోసగించెడి మిత్రుఁడు, భూమిపైన
దయయె లేనట్టి యజమాని, ప్రియము లేని
మాట విననట్టి భార్యయు మదికి బాధ.
భావము. మాట వినని పనివాళ్ళు, మోసం చేసే మిత్రులు, దయలేని యజమాని, వినయం లేని భార్య - ఇవి నాలుగు తలనొప్పులు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.