జైశ్రీరామ్.
శ్లో. పరవాదే దశవదనఃపరరంధ్రనిరీక్షణే సహస్రాక్షః
సద్వృత్త విత్తహరణే
బాహుసహస్రార్జునో నీచః.
గీ. పరుల నైచ్యంబులాడను పదియు నోర్లు.
పరుల దోషముల్ వెదుకను వంద కనులు,
పరుల ధనమునపహరింప పాలసులకు
వేయి చేతులు నిజమిది విశ్వమందు.
భావము. ఇతరుల దోషాలు వెతుకునప్పుడు పది ముఖములు, ఇతరుల లోపములను చూచుటలో వేయి కళ్ళు. మంచివారి మంచిని, డబ్బు దొంగిలించడంలో వేయి చేతులు కలిగినట్లుందురు - ఇది నీచుని స్వభావము.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.