జైశ్రీరామ్.
శ్లో. రజనికరః ఖలు శీతోరజనికరాచ్ఛన్దనో మహాశీతః
రజనికరచ్చన్దనాభ్యాం
సజ్జనవచనాని శీతాని.
క. వెన్నెల చల్లగ నుండును.
వెన్నెలకన్నమలయజము విన చల్లనిదౌన్.
మన్నిక గలిగిన సుజనుల
మిన్నగు వాగ్ఝరి చలువయె మిన్న కనంగన్.
భావము. వెన్నెల చల్లగా నుఇండును, మంచిగంధము వెన్నెలకన్నను చల్లగ నుండును. మహనీయుల మాటలు వెన్నెలకన్నను, మంచిగంధము కన్నను కూడా చల్లగా ఉందును కదా!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.