జైశ్రీరామ్.
శ్లో. తత్క్లిష్టం యద్విద్వాన్విద్యాపాఙ్గతోऽపి యత్నేన
విజ్ఞాతారం అవిన్దన్
భవతి సమః ప్రాకృతజనేన.
గీ. ప్రజల గుర్తింపు లేనట్టి పండితులిల
బ్రతుకవలయును సామాన్య ప్రజల వోలె.
కుందనపుపళ్ళెమునకైన గోడ చేర్పు
తప్పదిలలోన యను సూక్తి తలప నిజము.
భావము. ఎంతో శ్రమపడి సకల విద్యలలోను పండితుఁడైన విద్వాంసుఁడైనా సరే తనను గుర్తించేవారు లేక అందరిలోను సామాన్యులతో బాటుగానే సామాన్యజీవనం గడుపుతూ ఉండవలసినదే. బంగారు పళ్ళేమునకైనా గోడ చేర్పు కావాలంటారు.అదే ఇది.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.