గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, నవంబర్ 2014, ఆదివారం

అవధాన రాజధానిలో శ్రీ మడిపల్లి భద్రయ్య గారి సహృదయత నాపై కురిపించిన పద్యామృతం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! విశ్రాంత ఉన్నత పాఠశాల ప్రథానోపాధ్యాయులు శ్రీ మడిపల్లి భద్రయ్య గారు అవధాన రాజధానిలో నాపై కురిపించిన అవ్యాజనురాగ భరిత పద్యరత్నాలను, నా ప్రతిస్పందనను, వారు కలిగియున్న చిత్రములను, తిలకించగలరు.
శ్రీమాన్ వీరభద్రార్యా! నమస్తే.

ద్వివిధ కందద్వయ గీత గర్భ చంపకమాల.
శ్రియ ధిషణాఢ్య! సద్ వినుత ప్రేమ సుధాంబుధి!  వీరభద్రమా!
ప్రియ సచివా ! సుధా మధుర రీతి చరించుచు మమ్ముఁ బ్రోచితే !
జయ విసృతా న్తరా! సుగుణ జాల సముద్భవ శోభ వెల్గులన్
నయ ప్రచయాత్మవై సుగతి  నంద చరించెడి సూక్ష్మ భావనా ! (నంద=కలిమి)

శ్రియ ధిషణాఢ్య! సద్ వినుత ప్రేమ సుధాంబుధి!  వీరభద్రమా!
ప్రియ సచివా ! సుధా మధుర రీతి చరించుచు మమ్ముఁ బ్రోచితే !
జయ విసృతా న్తరా! సుగుణ జాల సముద్భవ శోభ వెల్గులన్
నయ ప్రచయాత్మవై సుగతి  నంద చరించెడి సూక్ష్మ భావనా ! 

ధిషణాఢ్య! సద్ వినుత ప్రే
మ సుధాంబుధి!  వీరభద్రమా!ప్రియ సచివా ! 
విసృతా న్తరా! సుగుణ జా
ల సముద్భవ శోభ వెల్గులన్ నయ ప్రచయా!

సచివా! సుధా మధుర రీ
తి చరించుచు మమ్ముఁ బ్రోచితే!జయ విసృతా !
ప్రచయాత్మవై సుగతి  నం
ద చరించెడి సూక్ష్మ భావనా! శ్రియ ధిషణా !

వినుత ప్రేమ సుధాంబుధి!  వీరభద్ర!
మధుర రీతి చరించుచు మమ్ముఁ బ్రోచి!
సుగుణ జాల సముద్భవ శోభ వెల్గు
సుగతి  నంద చరించెడి సూక్ష్మ భావ!

నమస్తే

మీ
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.