జైశ్రీరామ్.
శ్లో. శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః,పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం.
గీ. కోటి గ్రంథంబులు వచించు గొప్ప గుణము
అర్థ పద్యంబునందుండె నరయుడయ్య.
పరులకుపకృతి పుణ్యంబు, వరలఁ జేయు
పరుల కపకారమును జేయ పాపమగును.
భావము. కోటి గ్రంధాలలో చెప్పబడిన దానిని అర్థ శ్లోకంలో (అర్థ పద్యములో) చెపుతాను :
"పరోప కారమే పుణ్యం ; ఇతరులను బాధ పెట్టడమే పాపం".
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.