జైశ్రీరామ్.
శ్లో. అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||
గీ. అశుభములు నాశనంబౌత, యఖిల దురిత
భయములిల నాకు నశియించి. పరమ శాంతి
కలుగ చేయుత గ్రహములు కరుణ జూచి,
మంగళంబులు కూర్చుత మహితముగను.
భావము. అరిష్టములు నశించు గాక. పాపములు, భయములు తొలగు గాక, నాకు శాంతి, శుభము కలుగు గాక, గ్రహముల యనుగ్రహము నాకు కలుగు గాక. గ్రహములు నాకు మంగళప్రదులగుదురు గాక.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.