గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, నవంబర్ 2014, శుక్రవారం

అగ్నిహోత్రం గృహక్షేత్రే ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. అగ్నిహోత్రం గృహక్షేత్రే గర్భిణీం వృద్ధ బాలకౌ,  
రిక్తహస్తేన నోపేయా ద్రాజానం దైవతం గురుమ్.
గీ. యజ్ఞవాటిక కింటికి,అఖిల పుణ్య
క్షేత్రములకు,వృద్ధులు, గురు, శిశుల, గర్భ
వతుల, రాజుల దేవులన్ వట్టి చేతు
లనిల గనగ పోరాదంద్రు వినయ మతులు.
భావము. హోమం జరిగే చోటుకు, ఇంటికి, పుణ్యక్షేత్రానికి, వృద్ధులు, శిశువులు, గర్భవతులు వీరి దగ్గరికి, గురువు, దేవుడు, రాజు వీరి దగ్గరికి దర్శనార్థం వెళ్ళినప్పుడు వట్టిచేతులతో పోరాదు. అంటే పూలు, పళ్లు లాంటి వేవైనా తీసుకొని వెళ్లాలన్నమాట.                                                                                                                
                                                                            జైహింద్.
                                                                                        

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.