జైశ్రీరామ్.
శ్లో. స్నేహో హివరమఘటితో నవరం సంజాత విఘటితః స్నేహః
హృతనయనోహి విషాదీ
నవిషాదీ భవతి సఖలు జాత్యంధః
గీ. మైత్రి చేయక పోవుటే మహిని మేలు.
మిత్రుడై, తుది విడుచుట మేలు కాదు.
పుట్టు గ్రుడ్డియే మేలుగా పుడమిపైన
కోలుపోయిన కనులున్న గ్రుడ్డికన్న.
భావము. మైత్రి చేయకుండుటే మేలు. స్నేహం చేసి వదిలేయడం విడిపోవడం మంచిది కాదు.
కళ్ళుపోయిన వానికి బాధ. కానీ పుట్టుగుడ్డికి అంత బాధ ఉండదు కదా!
జైహింద్..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.