గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, నవంబర్ 2014, శనివారం

సులభాః పురుషాలోకే ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. సులభాః పురుషాలోకే సతతం ప్రియవాదినః
అప్రియస్య చ పధ్యస్య వక్తాశ్రోతా చదుర్లభః
గీ. జగతి ప్రియవాదులనునొప్పు నగణితముగ.
అప్రియంబయ్యు మేల్గూర్చు నద్భుతోక్తి
సత్యయుక్తంబు పలికెడి సరస సుమతు
లరుదు, వినువారలరుదుగ ధరణి నుంద్రు.
భావము. కమ్మని కబుర్లు చెప్పేవారు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అయితే చెప్పేటప్పుడు కష్టంగా ఉన్నా తరువాత మేలుకూర్చే మాటలు చెప్పేవాడు. దాన్ని వినేవారు దొరకడం కష్టం. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.