జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ నెల రెండవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మన దేశ రాజధాని హస్తినాపురం(ఢిల్లీ)లో శ్రీమాన్ డా.మాడుగుల నాగఫణి శర్మ గారు తలపెట్టిన అవధాన రాజధానీ కార్యక్రమము అత్యంత విజయవంతమైనది. లబ్ధప్రతిష్ఠులనేకులు ఈ కార్యక్రమమున పాల్గొని,విజయవంతం చేశారు. శ్రీమాన్ బలదేవానంద సాగర శ్రీమాన్ శంకర్‌నారాయణ, మున్నగు మహనీయులు ఈ కార్యక్రమమునాఅద్యంతము ఉండి శుభప్రదం చేశారు.
ముగింపుదినోత్సవమునాడు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చినాదంద మహర్షి కూడా సభకు విచ్చేసి తమ అనుగ్రహ భాషణం చేసి, అందరికీ తమ ఆశీస్సులందజేశారు.
శ్రీమాన్ నాగఫణి శర్మగారికి సచ్చిదానంద మహర్షి అవధానసమ్రాట్ అనే బిరుదును కూడా ప్రదానం చేశారు.
ఈ అవధాన కార్యక్రమమున ఆద్యంతము అత్యంత మహనీయంగా నిరుపమానంగా తన మహనీయతను శ్రీ నాగఫణిశర్మగారు ప్రదర్శించుట ద్వారా అందరినీ అబ్బురపరిచారు.
ఈ కార్యక్రమమున దత్తపది ఇచ్చుట ద్వారా నేను కూడా పృచ్ఛకుడుగా బాధ్యత నిర్వహించాను.
అవధాన రాజధానీ కార్యక్రమము.
పృచ్ఛకులుగా పాల్గొనిన మన సుప్రీమ్ కోర్ట్ జడ్జ్, మరికొందరు ప్రముఖులు.
సభనలంకరించిన డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ మున్నగువారు.
పృచ్ఛకులుగా పాల్గొని అవధానిపై ప్రశ్నను సంధిస్తున్న మన మాన్య మంత్రివర్యులు శ్రీమాన్ హరీష్ రావుగారు.
హరీష్ రావుగారి ప్రశ్నకు సమాధానంగా పద్యం చెప్పుచున్న అవధానిగారు.
కార్యక్రమమునకు విచ్చేసిన అవధానిగారిని ప్రశ్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీమతి పరిటాల సునీత గారు.
శ్రీమతి పరిటాల సునీతగారి ప్రశ్నకు మాడుగులవారి సమాధానం.
సభకు విచ్చేయుచున్న కేంద్ర మంత్రివర్యులు శ్రీమాన్ భండారు దత్తాత్రేయ.
సభనలంకరించిన సి.యమ్.రమేష్. మరియు మరొక ప్రముఖులు.
సభనలంకరించిన ప్రముఖ చలన చిత్ర కళాకారుడు శ్రీమాన్ దీక్షితులు
స్వరపది ప్రక్రియలో ప్రముఖ సంగీతవిద్వాసులైన సహోదరుల రాగాలాపన.
ప్రముఖ సంగీతవిద్వాసులైన సహోదరుల రాగాలాపనననుసరించి ఆశువుగా పాడుచున్న అవధానిగారు.
ఆ గానామృత సాగరంలో మునిగి పారవశ్యంతో బ్రతుకమ్మ నుద్దేశించి నృత్యము చేస్తున్న మహిళామణులు.
ఆ ఆనంద పారవ్శ్యంలో అవధానిగారిని ఆకాశానికెత్తి అభినందిస్తున్న ప్రేక్షకావళి.
అవధానంలో అప్రస్తుతప్రసంగం చేస్తూ అత్యద్భుతంగా అందరినీ అలరిస్తున్న శ్రీమాన్ శంకర నారాయణ గారు.
అవధాని గారిని ప్రశంసిద్తున్న మాన్య మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు.
అవధానినిపై ప్రశ్నను సంధిస్తున్న కేంద్ర ప్రసారాల శాఖామాత్యులు
సభనలంకరించిన శ్రీమాన్ గొల్లపూడి మారుతీరావు గారు.
అపారమైన అనుగ్రహంతో సభకు విచ్చేసిన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందమహర్షి.
అవధానిని ప్రశ్నిస్తున్న సచ్చిదానందమహర్షి.
తన ప్రశ్నకు అవధానిగారి సమాధానమును విని అతనిని ప్రశంసిస్తున్న సచ్చిదానందులు.
శ్రీమాన్ నాగఫణి శర్మ గారికి అవధాన సమ్రాట్ బిరుదుతో సత్కరిస్తున్న ప్రముఖులు.
పుంభావ సరస్వతీ మూర్తియైన యతీశ్వరులు అవధానిపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్న దృశ్యం.
వారి ప్రశ్నకు అవధానిగారి శ్లోకరూపంలో సమాధానం విని తన ఆనందాన్ని తెలియజేస్తున్న స్వామివారు.
అవధానిగారికి దత్తపదిని ఇచ్చిప్రశ్నిస్తున్న నేను.
సభలో నన్ను సత్కరిస్తున్న డా. నాగఫణిశర్మ దంపతులు.
ఆకాశవాణిలో ప్రతీరోజు సంస్కృత వార్తలు చదివే శ్రీమాన్ బలదేవానంద సాగర్ గారితో నేను.
ఈ కార్యక్రమమునకు సంబంధించిన మరికొన్ని ఛాయా చిత్రములు క్రమముగా ప్రచురించుటకు ప్రయత్నింతును.
జైహింద్.
8 comments:
చాలా సంతోషం!
అసభ్య, అసందర్బ ప్రలాపనలచేత బాధతో,అసహ్యంతో తల్లడిల్లుచున్న సరస్వతీదేవిని కాపు కాయడానికి అహరహము పాటుపడుచున్న మీలాంటి మహానుభావులందరికి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను.
నమస్కారాలండి ఆత్మీయ చింతా రామకృష్ణగారు.
చాలా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమ విశేషాలు చూస్తుంటే.
పరోక్షంలో చూస్తున్న అనుభూతితో అందించారు
ధన్యవాదాలండి.
నేను ప్రొద్దుట ఒక వ్యాఖ్య వ్రాసాను, ఎందుచేతనో కనబడడం లేదు. మీ దత్తపదీ, మిగతా సమస్యలూ అన్నీ వివరంగా వ్రాస్తే చదివి ఆనందిస్తాము.
మా గురువుగారు చింతా రామ కృష్ణా రావు గారు నాగ ఫణి శర్మ గారి అవధానంలో దత్తపదికి పృచ్ఛకులుగా బాధ్యత నిర్వహించి నారని తెలిసి చాలా ఆనందించాను. గురువు గారి అవధానం కూడా చూసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.
నమస్సులతో
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి
గురుతుల్యులు రామకృష్ణారావు గారికి అభినందనలు.
కొన్నైనా ఆ పద్యకుసుమాలను పంచుకుంటే చదివి ఆనందిస్తాం.
ధన్యవాదాలతో
sasidhar pingali
గురువుగారికి వందనములు.
శ్రీమాడుగుల నాగఫణిశర్మ గారి అవధాన విశేషాలను బ్లాగుముఖంగా మాతో పంచుకున్నదుకు చాలా ధన్యవాదములండీ. ఈ మహత్కార్యములో పృచ్చకులుగా పాల్గొన్న మీకు కూడా మా శుభాభినందనలు.
దయవుంచి సమస్యలు, దత్తపది, వర్ణనలాంటి అంశాలను తెలియజేస్తే మహదానందముగా ఉంటుంది.
ధన్యోస్మి.
నాపై ప్రేమామృతమును కురిపించిన శ్రీయుతులు కందిశంకరయ్య, సురేష్ బాబు, వీ.యస్.రావు, గిరి,ఏ. సత్యనారాయణ రెడ్డి, పింగళి శశిధర్, సంపత్‌కుమార్ శాస్త్రి, మున్నగు సహృదయులందరికీ నాహృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.