గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మే 2014, సోమవారం

వసంత కాలే సంప్రాప్తే , కాకః కాకః, పికః పికః మేలిమి బంగారం మన సంస్కృతి 200.

జైశ్రీరామ్.
శ్లో.కాకః కృష్ణః , పికః కృష్ణః కో భేదః పిక కాకయోః ?
వసంత కాలే సంప్రాప్తే , కాకః కాకః, పికః పికః 

గీ. కాక పికములు నల్లగా కానిపించు. 
తరుణ వాసంత మున భేదమరయ వచ్చు. 
మౌన ముద్రలో నందరూ జ్ఞాన ఖనులె. 
వినుత వాగ్ఝరిఁ చూపించు ఘనుడెవండొ. 
భావము. కాకీ నల్లగా ఉంటుంది, కోకిలా నల్లగా ఉంటుంది. వాటికి రంగులో భేదం ఏముంది ? వసంత ఋతువు వస్తే మాత్రం కాకి కాకియే, కోకిల కోకిలయే.
జైహింద్
Print this post

3 comments:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సాహితీమిత్రులు చింతా రామకృష్ణారావుగారికి నమస్కారాలు. శ్లోకమునకు తమరి తెనుఁగుసేఁత బాగున్నది. శుభాభినందనలు. ఇట్లే...నేను కూడ ఒకానొక సందర్భమున దీని యనువాదము ప్రకటించియున్నాను...అప్రస్తుతమనుకొనక పరిశీలింపఁగలరు.

కాకియుండు నలుపు, కోకిలమ్ము నలుపు!
వేషమొకటె, వాని భేదమేమి?
ఋజువగును వసంత ఋతువేగుదెంచఁగా,
కాకి కాకిగాని, కోకిలగునె?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ మధుసూదన్ గారూ! మీ అనువాదం కూడా బాగుందండి. కోకిలమ్ము అనుటకు బదులు కోకిలమ్మ అని అకారాంతంగా ఉంటే ఇంకా బాగుంటుందనిపిస్తోందండి.వ్యాఖ్య పంపినందుకు ధన్యవాదములండి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కాకి కోయిలల బేధమును చక్కగా వివరించారు. మనిషి మంచి చెడులను గ్రహించాలంటే వారి ప్రవర్తనను బట్టే కదా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.