జైశ్రీరామ్
శ్లో. అయం నిజ: పరో వేతి గణనా లఘుచేతసాం
ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్.
గీ. అతఁడు నావ్యక్తి. నావ్యక్తి యితడు కాడ
నుచు పలుకుదురజ్ఞానులనుపమ గతిని.
విశ్వవిజ్ఞాతలందరున్ విశ్వజనుల
నెల్లరిని తన వారిగా నెన్నుదురయ.
భావము. వీడు నావాడు, వీడు పరుడు అనే పరిగణన అల్పమనస్కులకు ఉంటుంది. ఉదార ప్రవర్తనగలవారికి మాత్రం ఈ ప్రపంచమే ఒక కుటుంబం.
జైహింద్.
4 comments:
నమస్కారములు
నేను నాది అనుకున్నవాడు స్వార్ధ పరుడు . దైవ చింతన కలిగి జ్ఞానం వైపుకు పయనించేవారు అలా ఆలోచించరు మంచి సూక్తి ధన్య వాదములు
'వసుధైవ...' లేక 'వసుధైక కుటుంబకమ్' లలో సరి అయినది ఏది ? ఎందువలన? దయచేసి వివరించండి.
వసుధైక కుటుంబకమ్
ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.