గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, మే 2012, ఆదివారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 11 / 14

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
గీ-
అనిన మోదంబు తోడ, హితార్హ కార్య  -   మునను జని యుండ నొక్కెడ, ముదిత యడరు 
చాయఁ  దగ వినుచును,  జేరి,  సకియ వార్తఁ  -  గనఁగ  వచ్చితి ననిన నాక్కాంత యంత. ౫౧.
గిరిక చెలికత్తె మోదముతో ఆ విధముగా స్తుతించుచు అనిన, హితార్హ (మిత్రునియొక్క యోగ్యమైన) కార్యమునకు (క్రియ వలన) ఒక్కెడ చని యుండ (ఒక్కావకాశము ఒప్పి యుండగా) ముదిత ఐన ఓ మంజు వాణీ! అడరు చాయను(మీ సకియ)ప్రకాశించు చున్న విషయమును తగ వినుచు, మీ కడకు చేరి, సకియ యైన గిరిక వార్త గనగ వచ్చితిని. అనిన  అంత అక్కాంత - - - - .
క:-
అయ్య మనోరమ సఖి నే  -  నయ్యుప వని స్వైర వృత్తి నమర, సఖులతో
నొయ్యన సుమాపదేశము  -  చయ్యనగా~ం జని ముదంబు సంధిల్లంగన్. ౫౨.
నా అయ్య యొక్క మనోరమయైన నా తల్లి యైన శుక్తిమతి యొక్క సఖి (చెలికత్తె {కలహంసి} యు) నేను, అయ్యుప వనిని స్వైర వృత్తిని అమర, సఖులతో ఒయ్యన (చక్కగా) చయ్యన (వెంటనే) సుమాపదేశము (పుష్పముల మిష) గా ముదంబు సంధిల్లగా, చని -  -  -  -  -  .
గీ:-
చిన్నతనముననుండుటఁ జేసి, చేరి  -  యుండఁ బొడమెడు మతి నా మహోత్తమ "సుమ
నో విశేషత నంతటను మునిరాగ  -  దత్త శాప క్రియను వచ్చితిత్తఱి "నని. ౫౩.
చిన్న తనము నుండియు ఆ కలహంస నా దగ్గర ఉఓడుటా చేసి, ఆమెను చేరి యుండ(కలిసిసికొన వలెనని)మతి పొడమెను.  నాన్ (అనగా) ఆ మహోత్తమమైన కలహంసి అంతట (అప్పుడు), ఇ త్తఱి  (ఈదిగో ఇప్పుడే) సుమనో విశేషతను (పూలతో) మునియొక్క అనురాగము చేతదత్తమైన శా (సామర్ధ్యముచే) ప (ప్రకాశించు) క్రియను వచ్చి యున్న దానను అని  -  -  -  .

వ:-
మఱియు, ౫౪.
గీ:-
అందు - చే; నను నీ యవ నిం దగఁ గూనఁ  -  గర్చురాకార! సంబాధ్య కలన వేగఁ
బుచ్చ వచ్చితి, రా! జన్య యిచ్చ దీర్పు  -  మనుచు శాస్ర హృదయ మీయ ననఘ బుద్ధి. ౫౫.
చేయి అందుము. నను నీ అవ్(అవ్వ=జనని)నిన్ను చేరతీసు కొనను కర్చుర (బంగారు) ఆకారము గల ఓ గిరికా!  సంబాధ్య (బంధుత్వ) కలనను (కారణమున) వేగముగా పుచ్చన్ (పంపిన) వచ్చితిని. రా! జన్య (తల్లి యొక్క) ఇచ్ఛను తీర్పుము. అనుచు, శాస్త్ర (ఆజ్ఞా యుక్తమగు) హృదయమీయ (అభిప్రాయమును దెల్పఁగా), అనఘ బుద్ధి యైన ఆ గిరిక - - - . 
(సశేషం)
జైహింద్.
Print this post

1 comments:

ఊకదంపుడు చెప్పారు...

నమస్కారమండీ. ఎంతో విపులం గా ద్వర్ధి కావ్యాన్ని మాకు వివరిస్తున్నారు. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.