జైశ్రీరామ్
వరూధినీ ప్రవరులు.
గీ-
చాయఁ దగ వినుచును, జేరి, సకియ వార్తఁ - గనఁగ వచ్చితి ననిన నాక్కాంత యంత. ౫౧.
ఆ వ్యాధుఁడట్లు అనిన స్వరోచి మోదంబు తోహితమైన అర్హమైన కార్యార్థము చేయ వెళ్ళి యుంఒక్క ఎడ(ప్రదేశమున) ఒకా నొక ముదిత యొక్క అడరు(దుఃఖము) ఆ చాయను(పార్శ్వ భూమి యందు) వినుచు, వినుచు, అచ్చటికిచేరి, ఓ సకియా! నీ దుఃఖ హేతువైన వార్తఁ గనఁగ వచ్చితిని. అని అనగా అంతన్ అక్కాంత అపుడు......
అయ్య మనోరమ సఖి నే - నయ్యుప వని స్వైర వృత్తి నమర, సఖులతో
నొయ్యన సుమాపదేశము - చయ్యనగా~ం జని ముదంబు సంధిల్లంగన్. ౫౨.
ఓ అయ్యా! నేను మనోరమ యను స్త్రీని. ఓయ్యన(చక్కగా) సఖులతో ఆ ఉప వనియందు స్వైర(స్వేచ్ఛా)వృత్తిని(ప్రవృత్తితో)అమరి యుండగా.. సు(యోగ్యమైన)మా(ధారణ గల చిత్తమును) పా(పాలించునట్టివాఁడైన మునీశ్వరుని యొక్క) ప్రదేశము చయ్యనఁగా(వేగముగా)జనిముదంబు సంధిల్లునట్లుగా.....
గీ:-
చిన్నతనముననుండుటఁ జేసి, చేరి - యుండఁ బొడమెడు మతి నా మహోత్తమ "సుమ
నో విశేషత నంతటను మునిరాగ - దత్త శాప క్రియను వచ్చితిత్తఱి "నని. ౫౩.
చిన్నతనమున ఉండుట (చిన్నతనమగుట )చేసి, ఆ మునిని సమీపించి యుండగా పొడమెడు (దుర్)మతి చేత ఆ మహోత్తమ(అట్టి మహా శ్రేష్టమగు) సుమనో(యోగ్యమగు మనస్సుయొక్క) వి(పోగొట్టఁబడిన) శేషతన్(ప్రాధాన్యముచే)(అతని చిత్తమునకు ప్రథానమైన యోగ్యత సడలి, కోపము వచ్చి, )అంతట ముని బయల్పడగా, మునిదత్తమైన, శాప క్రియచే(శాప ఫలితముగా)ఇత్తరి వచ్చితిని అని.....
వ:-
మఱియు, ౫౪.
మరియు...
గీ:-
అందు - చే; నను నీ యవ నిం దగఁ గూనఁ - గర్చురాకార! సంబాధ్య కలన వేగఁ
బుచ్చ వచ్చితి, రా! జన్య యిచ్చ దీర్పు - మనుచు శాస్ర హృదయ మీయ ననఘ బుద్ధి. ౫౫.
అందుచే(ఆ శాప కారణమున) నన్ను ఈ అవనిని తగఁగొనన్ (తనకు తగినట్లు పట్టుకొనగా) క ర్చుర(రాక్షస)ఆకారము గలవాని చేతనైన సంబాధ్య కలనను(బాధ పొందుట నుండి)వేగముగా పుచ్చన్(బాధను తొలగించుటకు) వచ్చితిని. రాజన్యా!
అందుచే(ఆ శాప కారణమున) నన్ను ఈ అవనిని తగఁగొనన్ (తనకు తగినట్లు పట్టుకొనగా) క ర్చుర(రాక్షస)ఆకారము గలవాని చేతనైన సంబాధ్య కలనను(బాధ పొందుట నుండి)వేగముగా పుచ్చన్(బాధను తొలగించుటకు) వచ్చితిని. రాజన్యా!
ఇచ్చఁ(కోరిక)దీర్పమనుచు శా(సామర్ధ్యముకలిగిన) అస్త్ర హృదయము అను విద్య నీయగా అనఘ బుద్ధి యగు స్వరోచి....
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.