జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
గీ:-
నిత్య పూజా రతిని తగు నెలవుఁ బాసి, - విధి సమీపించి, యంతట వెడలి శుక్తి
మతి తిరుగరాఁ బథంబున మరలుకొనగ - నగ వర ప్రాప్త సంగతి మగువ కలిగె. ౪౧.
నిత్య పూ౦జా రతిని కలదియై, తగు నెలవు(భూలోకమును)బాసి, విధిని సమీపించి, అంతట(ఆ పిమ్మట)వెడలి(బయలుదేరి) శుక్తిమతి, తిరుగ రాన్(మరలి వచ్చు చుండగా)పథంబుమధ్యమున కోలాహలుఁడు ఆమెను మరలుకొనగా(అడ్డగించగా), నగ(కోలాహల పర్వతమను వర(భర్త యొక్క)ప్రాప్తి చేత, సంగతి(సంగమము చేత) మగువ యగు ఈ గిరిక కలిగెను.
క:-
గిరికాంచితమగు ఖ్యాతిన్ - జరియించెడునన్న, సంతసంబునఁ దరుణీ!
కరమును మది నెంచితి - వసు - వరునొక్కని గూడ నగునువనిత" యఁటన్నన్. ౪౨.
గిరి అనెడి అంచితమగు నామముచే ఖ్యాతిని ఈమె సంచరించును. మంజు వాణి అట్లు అన్నన్ఆ ముని సంతసంబున తరుణీ! కరమును(మిక్కిలిగా)మది నెంచితిని. ఈ వనిత వసువరునొక్కని కూడ నగును(పెండ్లియాడుట సంభవించును) అటన్నన్౯అని చెప్పగా - - - -.
వ:-
ఆ లతా తన్వి యిట్లనియె.౪౩.
క:-
ఎన్నండిటకేతెంచెడి? - నెన్నండిట మమ్ముఁ జూచు?నెన్నడు మాతో
గ్రన్నన ఆటాడెడినో? - యన్నరవరుఁడనుచుఁ దలఁతు మయ్య మహాత్మా! ౪౪.
మహాత్మా! ఆ నరవరుఁడు ఎన్నండు ఇటకు వచ్చునో? ఎన్నండు మమ్ము జూచునో? ఎన్నడు మాతో గ్రన్నన మాటాడునో? అనుచు తలతుము.
గీ:-
అనినఁ గోరెదు గావున ననవరతము - పరులకుపకృతిఁ గావించు పట్ల నెట్టి
కార్యములనైనఁ గావింపఁగా వలెఁ గద! - సమయమున మానినీ! తోడ సరఁగ నిపుడు. ౪౫.
మంజు వాణి ఈ విధముగ ననిన ఆ రాజును జూడఁ గోరెదవు గావున అనవరతము పరులకుపకృతి గావించు పట్ల ఎట్టి

కార్యములనైనా కావింపగావలెఁ గదా! మానినీ! సరియగు సమయము నందు శీఘ్రముగా ఇపుడు తోడనే - - - -.
(సశేషం)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.