జైశ్రీరామ్
వరూధినీ ప్రవరులు.
గీః-
నీకు వసు విభుండొక్కఁడు చేకురెడి నఁ - టంచు నన, వారు హర్షంబు నందు మునుఁగఁ
గొంత తడవుండి యందొక్క యింతి మంజు - వాణి యిట్లని పల్కె సర్వంబుఁ దెలియ. ౩౬.
ఓ తరుణీ! నీకు వసువిభుండు(ధనవంతుఁడు)ఒక్కఁడు చేకురెడి నటంచు నన్ (ఈబీదవానితో పనియేమి అని) దీవింపగా వారు హర్షంబునందు వరూధిని మునుఁగఁ కొంత తడవుండి, ఒక్కింత సేపూరకుండి యుండ, అందొక్క యింతి మంజువాణి(మృదువాక్కు కల ఒక యింతి) సర్వంబు తెలియ నిట్లు పలికెను.
గీః-
విమల మతి! యెందుఁ బోయెడు వేడ్క నిందు - వచ్చిరతులమతిని ప్రేమ వరలఁ జేయఁ
దగును; గాన మురువు మీఱఁ దలిరుఁబోడి - వెదక వచ్చినఁ దగు విధి కొమరుల. ౩౭.
విమల మతివైన ఓ వరూధినీ!ఆ ప్రవరాఖ్యుఁడు ఎందు బోయెఁడును? ఇందు నీ వద్దకు తిరుగ వచ్చి, వేడ్కను రతులను మతిని ప్రేమను వరలఁ జేయుట కొఱకు అతడే తగును. కాన ఓ తలిరుబోడీ!విధి(కాలము యొక్క)కొమరుల(అందలము)చే(కాలానుకూలముచేత)మురువుమీర(కడు ఒప్పిదము)గా ఆ ప్రవరాఖ్యుని వెదక వచ్చినచో, కన దగును.
క:- అన నను గౌతమ విఖ్యా - తిని బిలిచెద రేను గోపతిని గూర్చి తపిం
చిన దాననే యశము గల - ఘన పదముం బొందితి, నని కడు ప్రేమమునన్. ౩౮.
ప్రియ సఖి ఆ విధముగా అనుగౌ(ప్రియముచే ఒప్పిదమగు)తమ యొక్క విఖ్యాతిచే పిలిచెదరు(ప్రవరాఖ్యుని వెదకుటకై ఆహ్వానించెదరు)నేను గోపతిని గూర్చితపిమ్చిన, దాని వలన ఏ యశము గల ఘన పదమును బొమ్దితిని? అని కడు ప్రేమముతో........
గీ:- సుఖ గతిని నాయనను గాంచి సుదతి కేళి - వనమునకుఁ బద్మినీ జాతి వరలఁ దేఁగ
వచ్చి, ఛద్మ ప్రవరరాగ వార్ధిఁ గాంచి, - చెంతకుం జేరితని యని చెలువు మీర. ౩౯.
సుఖ గతిని ఆప్రవరుని కాంచ చూచుటకు ఆ సుదతియైన వరూధిని పద్మినీ జాతి(స్త్రీలు)వరలఁ దేఁగ (వెంట నుడుకొని రాగా)కేళి వనమునకు వచ్చి, ఛద్మ(మాయా) ప్రవరుని యందైన అనురాగ వార్ధిచే ఆ ప్రవరును కాంచి, చెంతకు చేరి, తనియని చెలువు మీరగా.......
గీ:- అతివ పావనమౌ జన్మ మరయ, నాకు - నేఁడు సంతోషమయ్యెడు జాడఁ దెలియఁ
జెప్పి యొప్పింప వలెనని, చెలి మనమున - దలచి యడిగినఁ బలికెనంతట నెలంత. ౪౦.
అతివనైన నా యొక్క జన్మముపావనమైన దగును. అరయగా నాకు నేడు సంతోషమయ్యెడు. జాడ(పూర్వాపర సంబంధము)ను( ఈ విపృనకు తెలియ జెప్పి), ఒప్పించ వలెనని చెలి(వరూధిని) మనమున తలచి, రతి వాంఛచే అడుగగా అతఁడు అంతట నెలంత యగు వరూధినిని గూర్చి యిట్లు పలికెను.
(సశేషం)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.