శ్రీరామ్.
శ్రవంతి,వాదనా,నడత,రజ భార,రతిరా,వట్టమందు,దు ష్కరి,భంజయ,రతరాజిర,వ న్నెలమరు,గర్భ"-కలికొ లన"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
ఉత్తమము,మధ్యమము,అధమము అనునీ మూడిటి యందు,అధమమే
కలిప్రభావమున,పూజ్యతనందెనని
ఉ:-ఉత్తమ,మధ్య,మాధమ,నియోజన మిక్కలి టావు దప్పె!శ్రీ
చిత్తమెలర్ప నార్జనము!చిన్మయమై!"నధమంబు నంటెనే!
ఉత్తమ,మధ్యమద్వయపుటున్కి!చెడెం ఖలు చర్య పోషణన్!
పొత్తులు లేని మానవత!పూజ్యము నౌనొకొ?నెంచి చూడగన్?
"-కలికొలన"-వృత్తము"-
ఉత్కృతిఛందము.ర.జ.భ.ర.త.ర.న.భ.గ గ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
వట్టిదాయె!నుత్తమంబది!వట్టమందెం !మధ్యమంబు!వన్నె!నధమం బమరెన్లే?
గట్టి దుష్కృతాళి చేతుల!కట్టడందెం!భీతిలంగ!కన్నుల కు పండుగనంగన్?
పట్టెడన్న మంద నేరక!పట్టువీడెం!దోచుకోగ!బన్నము ల దూరమవంగన్!
పుట్టెడాశ లార్తి నందెను!బొట్టు భాగ్యం నెంచలేక?పున్నె మనుకొంచు!ధరిత్రిన్!
1గర్భగత"-"-శ్రవంతి"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.భ.గణములు.వృ.సం. 427.ప్రాసగలదు.
వట్టిదాయె!నుత్తమంబది!
గట్టి దుష్కృతాళి చేతుల!
పట్టె డన్న మంద నేరక!
పుట్టె డాశ లార్తి నందెను!
2.గర్భగత"-వాదనా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర,త.గల.గణములు.వృ .సం.163.ప్రాసగలదు.
వట్ట మందెం!మధ్య మంబు!
!కట్ట డందెం!భీతిలంగ!
పట్టు వీడెం!దోచు కోగ!
బొట్టు భాగ్యం!నెంచ లేక!
3.గర్భగత"-నడత"-వృత్తము.
బృహతీఛందము.భ.జ.య.గణములు.వృ.సం. 111.ప్రాసగలదు.
వన్నె!"నధమం"బమరెన్లే?
కన్నులకు పండుగనంగన్?
బన్నముల దూర మవంగన్?
పున్నె మనుకొంచు!ధరిత్రిన్!
4.గర్భగత"-రజభార"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.ర.త.గల.గణము లు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వట్టి దాయె! "నుత్తమం"బది!వట్ట మందెం!"మధ్య మంబు!
గట్టి దుష్కృతాళి చేతుల ! కట్ట డందెం భీతి లంగ!
పట్టె డన్న మంద నేరక! పట్టు వీడెం దోచు కోగ!
పుట్టె డాశ లార్తి నందెను!బొట్టు భాగ్యం నెంచ లేక?
5.గర్భగత"-రతిరా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.త.ర.న.భ.గగ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వట్ట మందెం మధ్యమంబు!వన్నె నధమం బమరెన్లే?
కట్ట డందెం ! భీతిలంగ?కన్నులకు పండు గనంగన్?
పట్టు వీడెం! దోచు కోగ!బన్నముల దూర మవంగన్?
బొట్టు భాగ్యం నెంచ లేక?పున్నెమనుకొంచు ధరిత్రిన్!
6.గర్భగత"-వట్టమందు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.త.ర.న.భ.మ.జ.ర. లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
వట్టమందెం!మధ్యమంబు!వన్నెనధమమం బమరెన్లే?వట్టిదాయె!నుత్తమం బది?
కట్టడందెం!భీతిలంగ?కన్నులకు పండు గనంగం?గట్టి దుష్కృతాళి చేతుల?
పట్టువీడెం!దోచు కోగ!బన్నముల దూరమవంగన్!పట్టె డన్న మంద నేరక?
బొట్టు భాగ్యం!నెంచ లేక?పున్నె మనుకొంచు ధరిత్రిం!పట్టె డాశల!నార్తి! నందెను!
7,గర్భగత"-దుష్కరి"-వృత్తము.
ధృతిఛందము.భ.జ.య.ర.జ.భ.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వన్నె!నధమం బమరెన్లే?వట్టి దాయె! నుత్తమం బది?
కన్నులకు!పండు గనంగం?గట్టి దుష్కృతాళి చేతుల?
బన్నముల దూరమవంగం?పట్టె డన్న మంద నేరక?
పున్నె మనుకొంచు ధరిత్రిం?పట్టె డాశల నార్తినందెను!
8.గర్భగత"-భంజయ"-వృత్తము.
ఉత్కృతిభంజయ భ.జ.య.ర.జ.భ.ర.త.గల.గణముగలయతులు .10,19.
ప్రాస నీమముగలదు.
వన్నె"నధమం"బమరెన్లే?వట్టిదాయె! "నుత్తమం"బది?వట్ట మందెం!"మధ్య మం"బు?
కన్నులకు పండుగనంగం?గట్టి దుష్కృతాళి చేతుల!కట్టడందెం!భీతిలంగ?
బన్నముల దూరమవంగం?పట్టె డన్న మందనేరక?పట్టు వీడెం దోచుకోగ?
పున్నె మనుకొంచు ధరిట్టె?పట్టె డాశల నార్తి నందెను?బొట్టు భాగ్యం!నెంచలేక?
9,గర్భగత"-అపరాజిర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.త.ర.జ.ర.లల. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వట్టమందెం!"మధ్యమంబు"!వట్టిదాయె !"నుత్తమం"బది?
కట్ట డందెం!భీతిలంగ? గట్టి దుష్కృతాళి చేతుల?
పట్టు వీడెం!దోచు కోగ?పట్టె డన్న మంద నేరక?
బొట్టు భాగ్యం!నెంచ లేక?పట్టె డాశల నార్తినందెను?
10,గర్భగత"-వన్నెలమరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.త.ర.జ.ర.స.న.భ. గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
వట్టమందెం!మధ్యమంబు!వట్టిదాయె!" నుత్తమం"బది?వన్నె!"నధమం" బమరెన్లే?
కట్టడందెం!భీతిలంగ?గట్టి దుష్కృతాళి చేతుల?కన్నులకు పండుగనంగన్?
పట్టు వీడెం!దోచుకోగ?పట్టె డన్నమంద నేరక?బన్నములదూరమవంగన్?
బొట్టు భాగ్యం!నెంచలేక?పట్టెడాశల నార్తి నందెను!పున్నెమను కొంచు ధరిత్రిన్
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అలతి అలతి పదములతో అన్ని వృత్తములు సులభ గ్రాహ్యములుగా నున్నవి శ్రీ వల్లభవఝుల వారికి ధన్య వాదములు. శ్రీ చింతా సోదరులకు అభినందనలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.