నయ,కులాశ్రి,కళా,గవాం పతి,సుఖమయ,సుఖతా,నమనా ,వడగొను,సంధురీగడిమిగు రు,గర్భ"-సిడిముడి"-వృ త్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-సిడిముడి"-వృత్తము
ఉత్కృతిఛందము.న.న.న.జ.జ.ర.న.స.గ గ.గణములు.
యతులు.10,18, ప్రాసనీమముగలదు.
సిడిముడి పడ వలదు!శివాయను చాలు ముక్తి!జీవితము సుఖవంతంబౌ!
చెడువిడి నడువు మిల!శివంబగు మార్గమెంచి!సేవను గడుపు జన్మంబున్!
గడిమిగిరి నుడువకు!గవాంపతి కీర్తి సేయు!గావు కొన కను సత్యంబున్!
వడగొన దురితము కను!భవాంబుధి నీల్గ మాని!భావుకము లలరం జీవా!
సిడిముడి=కోపము,గడిమిగిరి=హద్దు మీరి,శివంబగు=శాంతమగును,
గవాంపతి=సూర్యుడు,వడగొన=తాపము నందగ,దురితముకను=
చెడును చూడుము,భవాంబుధి=పాప సముద్రము,భావుకము=శుభము.
1.గర్భగత"-నయ"-వృత్తము.
బృహతీఛందము.న.న.న.గణములు.వృ.సం. 512.ప్రాసగలదు.
సిడిముడి పడ వలదు!
చెడువిడి నడువు మిల!
గడి మిగిరి నుడువకు!
వడగొన దురితము కను!
2.గర్భగత"-కులాశ్రి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.జ.గల.గణములు. వృ.సం.174.ప్రాసగలదు.
శివా యను చాలు ముక్తి!
శివంబగు మార్గ మెంచి!
గవాంపతి కీర్తి సేయు!
భవాంబుధి నీల్గ మాని!
3.గర్భగత"-కళా"-వృత్తము.
బృహతీఛందము.భ.న.మ.గణములు.వృ.సం. 63.ప్రాసగలదు.
జీవితము సుఖ వంతంబౌ!
సేవను గడుపు జన్మంబున్!
గావు కొనకను సత్యంబున్!
భావుకంబు లలరం!జీవా!
4.గర్భగత"-గవాంపతి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.న.జ.జ.గల. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సిడిముడి పడవలదు!శివా యను చాలు ముక్తి!
చెడువిడి నడువు మిల!శివంబగు మార్గ మెంచి!
గడి మిగిరి నుడువకు! గవాంపతి కీర్తి సేయు!
వడగొన దురితము కను! భవాంబుధి నీల్గ మాని!
5.గర్భగత"-సుఖమయ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.ర.న.స.గగ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శివా!యను చాలు ముక్తి!జీవితము సుఖవంతంబౌ!
శివంబగు మార్గ మెంచి!సేవను గడుపు జన్మంబున్!
గవాంపతి కీర్తి సేయు!గావుకొనకను సత్యంబున్!
భవాంబుధి నీల్గ మాని!భావుకము లలరం జీవా!
6.గర్భగత"-సుఖతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.ర.న.స.త.న.న. లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
శివా!యను చాలు ముక్తి!జీవితము సుఖవంతంబౌ!సిడిముడి పడ వలదు?
శివంబగు మార్గ మెంచి!సేవను గడుపు జన్మంబుం!చెడువిడి నడువు మిల!
గవాంపతి కీర్తి సేయు!గావు కొనకం సత్యంబుం!గడి మిగిరి నుడువకు!
భవాంబుధి నీల్గ మాని!భావుకము లలరం జీవా!వడగొన దురితము కను!
7.గర్భగత"-నమనా"-వృత్తము.
ధృతిఛందము.భ.న.మ.న.న.న.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జీవితము సుఖవంతంబౌ!సిడిముడి పడవలదు!
సేవను గడుపు జన్మంబుం!చెడువిడి నడువు మిల!
గావుకొనకం సత్యంబుం!గడి మిగిరి నుడువకు!
భావుకము లలరం జీవా!వడగొన దురితము కను!
8.గర్భగత"-వడగొను"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.మ.న.న.న.జ.జ. గల.గణములు.యతులు.10,19.ప్రాసనీ మముగలదు.
జీవితముసుఖవంతంబౌ!సిడి ముడి పడవలదు!శివాయను చాలు ముక్తి!
సేవను గడుపు జన్మంబుం!చెడువిడి నడువు మిల!శివంబగు మార్గ మెంచి?
గావుకొనకం సత్యంబుం!గడి మిగిరి నుడువకు!గవాంపతి కీర్తి సేయు!
భావుకము లలరం జీవా!వడగొన దురితము కను!భవాంబుధి నీల్గ మాని!
9.గర్భగత"-సింధురీ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.భ.న.న.లల. గణములు.యతి.9 వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శివాయను చాలు ముక్తి!సిడిముడి పడ వలదు!
శివంబగు మార్గమెంచి!చెడువిడి నడువు మిల!
గవాంపతి కీర్తి సేయు!గడి మిగిరి నుడువకు!
భవాంబుధి నీల్గ మాని!వడగొన దురితము కను!
10గర్భగగత"-గడిమిగుర"-వృత్తము
ఉత్కృతిఛందము.జ.జ.భ.న.న.స.న.స. గగ.గణములు.యతులు.9,18,
ప్రాసనీమభుగలదు.
శివా!యను చాలు ముక్తి!సిడిముడి పడ వలదు!జీవితము సుఖవంతంబౌ!
శివంబగు మార్గమెంచి!చెడు విడి నడువు మిల!సేవను గడుపు జన్మంబున్!
గవాంపతి కీర్తిసేయు!గడి మిగిరి నుడువకు!గావు కొనకం సత్యంబున్?
భవాంబుధి నీల్గ మాని!వడగొన దురితము కను!భావుకము లలరం జీవా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.