జైశ్రీరామ్.
నిదర్శనా,కులాశ్రి,రాజియ,జీవనపొత్తం,కావని,విలసిలు,రాజియ,చింతార్భటి,జాబిలి,పెన్నిధి,గర్భ"-త్రిభుజార్షజ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-త్రిభుజార్షజ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.భ.జ.జ.ర.జ.భ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
జీవన పొత్తము మొత్తము శివంబెటు కానదాయె!చింతలార్భటిం విలసిల్లెన్!
పావన మెచ్చట లేదయె!భవాలను మాప రావ!పంతులేని పాపము నిండెన్!
కావగ రావిట నేలయ?కవీంద్రుల పెన్నిధీవు!కాంతినింపు శోభిల లోకమ్!
శ్రీవర మిత్రమ శంకర! శివాని!భవాని!మెచ్చ!చెంత నిల్చి గావుమి దేవా!
1.గర్భగత"-నిదర్శనా"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.భ.గణములు.వృ.సం.439,ప్రాసగలదు.
జీవన పొత్తమ మొత్తము
పావన మెచ్చట లేదయె?
కావగ రావిట నేలయ?
శ్రీవర మిత్రమ శంకర!
2.గర్భగత"-కులాశ్రి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.జ.గల.గణములు.వృ.సం.174.ప్రాసగలెటు
శివం బెటు కానదాయె!
భవాలను మాప రావ!
కవీంద్రుల పెన్నిధీవు!
శివాని!భవాని మెచ్చ!
3.గర్భగత"-రాజియ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.య.గణములు.వృ.సం.107.ప్రాసగలదు.
చింతలార్భటిం విలసిల్లెన్!
పంతులేని పాపము నిండెన్!
కాంతి నింపు శోభిల లోకం!
చెంత నిల్చి కావుమి దేవా!
4.గర్భగత"-జీవన పొత్తం"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.భ.జ.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జీవన పొత్తము మొత్తము!శివంబెటు కానదాయె?
పావన మెచ్చట లేదయె?భవాలను మాప రావ!
కావగ రావిట నేలయ? కవీంద్రుల పెన్నిధీవు!
శ్రీవర మిత్రమ శంకర!శివాని!భవాని మెచ్చ!
5.గర్భగత"-కావని"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.ర.జ.భ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శివంబెటు గానదాయె?చింత లార్భటిం విలసిల్లెన్!
భవాలను మాప రావ?పంతు లేని పాపము నిండెన్!
కవీంద్రుల పెన్నిధీవు!కాంతి నింపు శోభిల లోకం!
శివాని!భవాని!మెచ్చ!చెంత నిల్చి గావుమి దేవా!
6.గర్భగత"-లఘ్వంత విలసిలు"-
ఉత్కృతిఛందము.జ.జ.ర.జ.భ.మ.స.స.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
శివంబెటు కానదాయె?చింత లార్భటిం విలసిల్లెం!జీవన పొత్తము మొత్తము!
భవాలను మాప రావ?పంతు లేని పాపము నిండెం!పావన మెచ్చట లేదయె?కవీంద్రుల పెన్ని ధీవు!కాంతి నింపు శోభిల లోకం! కావగ రావిట నేలయ?
శివాని!భవాని!మెచ్చ!చెంత నిల్చి గావుమి దేవా!శ్రీవర మిత్రమ శంకర!
7.గర్భగత"-రాజియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.య.భ.భ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చింతలార్భటిం విలసిల్లెం!జీవన పొత్తము మొత్తము!
పంతులేని పాపము నిండెం!పావన మెచ్చట లేదయె?
కాంతి నింపు శోభిల లోకం!కావగ రావిట నేలయ?
చెంత నిల్చి గావుమి దేవా!శ్రీవర మిత్రమ శంకర!
8,గర్భగత.లఘ్వంత"-చింలార్భటి"-.
ఉత్కృతిఛందము.ర.జ.య.భ.భ.భ.జ.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చింత లార్భటిం విలసిల్లెం!జీవన పొత్తము మొత్తము!శివం బెటు కానదాయె?
పంతులేని పాపము నిండెం!పావన మెచ్చట లేదయె?భవాలను మాప రావ?
కాంతి నింపు శోభిల లోకం!కావగ రావిట నేలయ?కవీంద్రుల పెన్నిధీవు!
చెంత నిల్చి గావుమి దేవా!శ్రీవర మిత్రమ శంకర!శివాని!భవాని మెచ్చ!
9.గర్భగత"-జాబిలి"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.ర.స.స.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శివం బెటు కానదాయె?జీవన పొత్తము మొత్తము!
భవాలను మాప రావ?పావన మెచ్చట లేదయె?
కవీంద్రుల పెన్నిధీవు!కావగ రావిట నేలయ?
శివాని!భవాని!మెచ్చ!శ్రీవర మిత్రమ శంకర!
10,గర్భగత"-పెన్నిధి"-వృత్తము.
ఉత్కృతి ఛందము.జ.జ.ర.స.స.స.జ.భ.గగ.గణములు.యతులు.య9,18
.ప్రాసనీమముగలదు.
శివంబెటు కానదాయె?జీవన పొత్తము మొత్తము!చింత లార్భటిం విలసిల్లెన్!
భవాలను మాప రావ?పావన మెచ్చట లేదయె?పంతులేని పాపము నిండెం!
కవీంద్రుల పెన్ని ధీవు! కావగ రావిట నేలయ? కాంతి నింపు శోభిల లోకం!
శివాని!భవాని!మెచ్చ!శ్రీవర మిత్రమ శంకర! చెంత నిల్చి గావుమి దేవా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.