గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2018, శనివారం

యుగళకంద,గీతికా,భాసిజ,దేవేరీ,జగన్మూల,అంజలీ,భాసిజనయన,మూలక,నయోర్బల,ఖ్యాతినీ,మననేల?,గర్భ"-విధివ్రాలు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

యుగళకంద,గీతికా,భాసిజ,దేవేరీ,జగన్మూల,అంజలీ,భాసిజనయన,మూలక,నయోర్బల,ఖ్యాతినీ,మననేల?,గర్భ"-విధివ్రాలు"-వృత్తము.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
 జుత్తాడ.
      
"-విధివ్రాలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.న.భ.భ.స.జ.న.జ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
మాతే!జగతికి,మూలము!మాతను,మదినెంచవోయి!మనుజత! నొప్పంభువిం
ఖ్యాతిం!నెలకొనగం నడు!ఘాతుకులకు లేదు ముక్తి!కనుగొను,సత్యంబిలం!
భూతే!వర మనరాదయ! పోతర మది తప్పుతప్పు!పునరపి!నెంచ న్వలెన్!
వ్రాతం చెరప వశంబొకొ! భ్రాతరొ!మది నూహ జేయు!ప్రణుతిల లోకం సదా!

1,గర్భగత"-యుగళకందములు.
1.కం.మాతే!జగతికి మూలము
        మాతను మది నెంచ వోయి! మనుజత నొప్పన్
       ఖ్యాతిం నెలకొనగం నడు!
       ఘాతుకులకు లేదు ముక్తి! కనుగొను సత్యమ్!
2.కం.భూతే!వర మన రాదయ!
        పోతర మది తప్పు!తప్పు!పునరపి నెంచన్!
       వ్రాతం!చెరప వశంబొకొ?
       భ్రాతరొ!మది నూహ జేయు! ప్రణుతిల లోకమ్!

2.గర్భగత"-గీతికా"-వృత్తము.
బృహతీఛందము.త.న.భ.గణములు.వృ.సం.445.ప్రాసగలదు.
మాతే!జగతికి మూలము!
ఖ్యాతిం!నెలకొనగం నడు!
భూతే!వరమన రాదయ!
వ్రాతం చెరప వశంబొకొ?

3.గర్భగత"-భాసిజ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.జ.గణములు.వృ.సం.351.ప్రాసగలదు.
మాతను మది నెంచ వోయి!
ఘాతుకులకు లేదు ముక్తి!
పోతర మది తప్పు!తప్పు!
భ్రాతరొ!మది నూహ జేయు!

4.గర్భగత"-దేవేరీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.య.లగ.గణములు.వృ.సం.80.ప్రాసగలదు.
మనుజత నొప్పం?భువిన్!
కనుగొను సత్యంబిలన్!
పునరపి యెంచం వలెన్?
ప్రణుతిల!లోకం సదా!

5.గర్భగత"-జగన్మూల"-వృత్తము.
ధృతిఛందము.త.న.భ.భ.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాతే!జగతికి మూలము!మాతను మది నెంచ వోయి!
ఖ్యాతిం!నెలకొనగం నడు!ఘాతుకులకు లేదు ముక్తి!
భూతే!వరమన రాదయ!పోతర మది తప్పు!తప్పు!
వ్రాతను!చెరప వశంబొకొ!భ్రాతరొ!మది నూహ జేయు!

6.గర్భగత"-అంజలి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.జ.న.య.లగ.గణమలు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాతను!మది నెంచవోయి!మనుజత నొప్పం భువిన్!
ఘాతుకులకు లేదు ముక్తి!కనుగొను సత్యం బిలన్!
పోతరమది తప్పు!తప్పు!పునరపి నెంచం వలెన్!
భ్రాతరొ!మది నూహ జేయు!ప్రణుతిల లోకం సదా!

7.గర్భగత"-భాసిజ నయన"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.న.య.య.భ.స.లల.గణములు.
యతులు.10,18.ప్రాసనీమముగలదు.
మాతను మదినెంచవోయి!మనుజత నొప్పంభువిం!మాతే!జగతికి మూలము!ఘాతుకులకు లేదుముక్తి!కనుగొను సత్యం బిలం!ఖ్యాతింనెలకొనగంనడు!
పోతర మది!తప్పు తప్పు!పునరపి నెంచం వలెం!భూతే!వర మన రాదయ!
భ్రాతరొ!మదినూహ జేయు!ప్రణుతిల లోకం సదా!వ్రాతను చెరప వశంబొకొ?

8.గర్భగత"-మూలక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.య.య.భ.స.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మనుజత నొప్పం భువిం!మాతే!జగతికి మూలము!
కనుకొను సత్యంబిలం!ఖ్యాతింనెలకొనగం నడు!
పునరపి నెంచం వలెం!భూతే వర మనరాదయ!
ప్రణుతిల లోకం సదా!వ్రాతను చెరప వశంబొకొ?

9.గర్భగత"-నయోర్బల"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.య.భ.స.స.న.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
మనుజత,నొప్పం భువిం!మాతే!జగతికిమూలము!మాతను మదినెంచవోయి!
కనుగొన సత్యం బిలం!ఖ్యాతిం!నెలకొనగం నడు! ఘాతుకులకు లేదు ముక్తి!
పునరపి నెంచంవలెం!భూతే!వర మనరాదయ! పోతర మది తప్పు తప్పు!
ప్రణుతిల లోకం సదా!వ్రాతను చెరప వశంబొకొ?భ్రాతరొ మది నూహ జేయు!

10,గర్భగత"-ఖ్యాతినీ"-వృత్తము.
ధృతిఛందము.భ.స.జ.త.న.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాతను మది నెంచవోయి!మాతే!జగతికి మూలము!
ఘాతుకులకు లేదు ముక్తి!ఖ్యాతిం!నెలకొనగం నడు!
పోతర మది తప్పు తప్పు!భూతే!వర మనరాదయ!
భ్రాతరొ మది నూహ జేయు!వ్రాతను చెరప వశంబొకొ?

11.గర్భగత"-మనవేల"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.త.న.భ.న.య.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
మాతను,మది నెంచవోయి!మాతే!జగతికి మూలము!మనుజతనొప్పంభువిం!
ఘాతుకులకు లేదు ముక్తి!ఖ్యాతిం నెలకొనగం నడు!కనుగొన సత్యం బిలన్?
పోతర మది తప్పుతప్పు!భూతే!వర మన రాదయ! పునరపి నెంచం వలెన్!
భ్రాతరొ!మదినూహ జేయు!వ్రాతను చెరప వశంబొకొ?ప్రణుతిల లోకం సదా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అసలు ఇన్ని వృత్తములు ఇలా తెలుసుకొన గలగడము మా పూర్వజన్మ సుకృతము. " విధివ్రాలు వృత్తము, యుగళ కందములు , ఇంకా, ఇంకా , ఈ ఛందస్సనే మహా సముద్రమును కన్నుల విందుగా పఠించ గలుగు తున్నందుకు అమితానందముగా నున్నది. శ్రీ పండితుల వారికి ప్రణామములు . శ్రీ చింతా సోదరులకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.