జైశ్రీరామ్.
శ్లో. తైలాద్రక్షేత్ జలాద్రక్షేత్ - రక్షేత్ శిధిలబంధనాత్ |మూర్ఖహస్తే న దాతవ్యం - ఏవం వదతి పుస్తకమ్ ||
తే.గీ. తైలముల నుండి రక్షించు ధర్మ విదుఁడ!
జలము సోకక రక్షించు సరస మతిరొ!
శిథిలమవనీక రక్షించు చిత్స్వరూప
మూర్ఖులకునీయకుండు నన్ పూజనీయ.
అనుచు ప్రార్హించె పుస్తకమనుపమ నిను.
భావము.
"నూనె నుండి, నీటి నుండి మరియు కుట్టునుండి విడిపోని విధంగా రక్షించవలెనని,ఆ విధంగా రక్షించలేని తనని మూర్ఖుడికి దానం ఇవ్వవద్దని పుస్తకం ప్రార్థించుచున్నది".
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.