గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, సెప్టెంబర్ 2018, గురువారం

మత్తరజినీ, ద్వయ, సమాశ్రీ,,సుగంధినీ, యతిర్నవ సుగంధి ద్వయ,కొంగు బంగరు ,రజినీకర ప్రియ,కల్పద్రుమ,దివివర్గ,గర్భ"-గిరివరదమ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
మత్తరజినీ, ద్వయ, సమాశ్రీ,,సుగంధినీ, యతిర్నవ సుగంధి ద్వయ,కొంగు బంగరు ,రజినీకర ప్రియ,కల్పద్రుమ,దివివర్గ,గర్భ"-గిరివరదమ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ.
                       
"-గిరివరదమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
నీతిలేని నేత లేలికం!నీమ నిష్ట భ్రష్టు పట్టు!నింగి నేల యేకమై జనున్?
భీత చేతనంబు లోకమౌ!ప్రేమలేని జీవులౌచు!బెంగ నిండు జీవితంబులన్?
గోత బడ్బ గొడ్డు తీరగుం!కోమలంబుగీడ్పడంగ!కొంగు,మోముజేర్చి రోదిలున్?
ప్రేత కర్మకాష్ట మేర్పడుం!భీమదాలు పెచ్చు పెర్గు!వెంగళత్వ మందుభావినిన్?

1,గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1.నీతి లేని నేత లేలికన్!                  2.నింగి నేల యేకమై జనున్!
  భీత చేతనంబు లోకమౌ!                   బెంగ నిండు జీవితంబులున్!
  గోత బడ్డ గొ్డు తీరగుం!                    కొంగు మోము జేర్చి రోదిలున్!
  ప్రేత కర్మ కాష్ట మేర్పడున్!                  వెంగళత్వ మందు భావినిన్!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
నీమ నిష్ట భ్రష్టు పట్టు!
ప్రేమలేని జీవు లౌచు!
కోమలంబు గీడ్పడంగ!
భీమదాలు పెచ్చు పెర్గు!

3.గర్భగత"-సుగంధినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీతిలేని నేత లేలికం!నీమ నిష్ట భ్రష్టు పట్టు!
భీత చేతనంబు లోకమౌ!ప్రేమ లేని జీవులౌచు!
గోత బడ్డ గొడ్డుతీరగుం! కోమలంబు గీడ్పడంగ!
ప్రేత కర్మ కాష్ట మేర్పడుం!భీమదాలు పెచ్చు పెర్గు!

4.గర్భగత"-యతిర్నవ సుగంధి ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.నీమ నిష్ట భ్రష్టు పట్టు!నింగి నేల యేకమై జనున్!
   ప్రేమలేని జీవు లౌచు!బెంగ నిండు జీవితంబులన్!
  కోమలంబు గీడ్పడంగ!కొంగు మోము జేర్చి రోదిలున్!
  భీమదాలు పెచ్చు పెర్గు!వెంగళత్వ మందు భావినిన్!

2.నీమ నిష్ట భ్రష్టు పట్టు!నీతి లేని నేత లేలికన్!
   ప్రేమ లేని జీవు లౌచు!భీత చేతనంబు లోకమౌ!
  కోమలంబు గీడ్పడంగ!గోత బడ్డ గొడ్డు తీరగున్!
 భీమదాలు పెచ్చు పెర్గు!ప్రేత కర్మ కాష్ట మేర్పడున్!

5.గర్భగత"-కొంగుబంగరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
నీమ నిష్ట భ్రష్టు పట్టు!నింగి నేల యేకమై జనుం!నీతి లేని నేత లేలికన్!
ష్రేమ లేని జీవులౌచు!బెంగ నిండు జీవితంబులం!భీత చేతనంబు లోకమౌ!
కోమలంబు గీడ్పడంగ!కొంగు మోము జేర్చి రోదిలుం!గోతబడ్డ గొడ్డు తీరగున్?
భీమదాలు పెచ్చు పెర్గు!వెంగళత్వ మందు భావినిం!ప్రేత కర్మ కాష్ట మేర్పడున్!

6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నింగి నేల యేకమై జనుం!నీతిలేని నేత లేలికన్?
బెంగన నిండు జీవితంబులం!భీత చేతనంబు లోకమౌ?
కొంగు మోము జేర్చి రోదిలుం!గోత బడ్డ గొడ్డు తీరగున్!
వెంగళత్వమందు భావినిం! ప్రేత కర్మ కాష్ట మేర్పడున్!

7.గర్భగత"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నింగి నేల యేకమై జనుం!నీతిలేని నేత లేలికం!నీమ నిష్ట భ్రష్టు పట్టు!
బెంగ నిండు జీవితంబులం!భీత చేతనంబు లోకమౌ!ప్రేమలేని జీవులౌచు?
కొంగు మోము జేర్చి రోదిలుం!గోత బడ్డ గొడ్డు తీరగుం!కోమలంబు గీడ్పడంగ!
వెంగళత్వ మందు భావినిం!ప్రేత కర్మ కాష్ట మేర్పడుం!భీమదాలు పెచ్చు పెర్గు!

8.గర్భగత"-దివివర్గ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.త.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
నీమ నిష్ట భ్రష్టు పట్టె!నీతిలేని నేత లేలికం!నింగి నేల యేకమై జనున్!
ప్రేమలేని జీవులౌచు!భీత చేతనంబు లోకమౌ!బెంగ నిండు జీవితంబులన్!
కోమలంబు గీడ్పడంగ!గోత బడ్డ గొడ్డుతీరగుం!కొంగు మోముజేర్చి రోదిలున్?
భీమదాలు పెచ్చు పెర్గు!ప్రేత కర్మ కాష్ట మేర్పడుం!వెంగళత్వమందు భావినిన్!
స్వస్తి.
మూర్తి జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే నీతి నియమం లేని అవినీతి పరుల పాలనలో జనుల పాట్లు ప్రేత కర్మల కాష్టమే ఏర్పడగలదు . నిస్సందేహముగా "
అన్ని పద్యములు అలరించు చున్నవి . కవిశ్రేష్టులకు జోహార్లు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.