గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, సెప్టెంబర్ 2018, సోమవారం

मातृवत् पर दारॆषु .. .. .. మేలిమి బంగారం మన సంస్కృతి,

 జైశ్రీరామ్.
श्लॊ. मातृवत् पर दारॆषु 
पर द्रव्यॆषु लॊष्टवत्, 
आत्मवत् सर्व भूतॆषु 
यः पश्यति स पंडितः.

కం. పర సతులను తన తల్లిగ
పర ధనమును మట్టివలెను, భావించుచునే
పరులను తనగా చూచెడి
నిరుపములిల పండితులు పునీతులు వారే.

భావము. పర కాంతలను తన తల్లిగాను, పరుల ధనమును మట్టి వలెను, ఇతరులను తన వలెను తెలియువారే పండితులు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చక్కని సూక్తి . బాగుంది. ఇంతకంటె మేలిమి మరి ఏసంస్కృతిలో ఉంది ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.