గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, సెప్టెంబర్ 2018, బుధవారం

శ్రీ గురుభ్యో నమః. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా!. నేడు మన మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. ఉపాధ్యాయ దినోత్సవముగా ప్రసిద్ధమై ఉపధ్యాయ వృత్తికే వన్నె తెచ్చెడి మహనీయులకు సన్మానము చేసుకొను శుభదినము.
ఆనంద మూర్తులై జ్ఞాన తేజో విరాజితులై బోధనా కుశలురై విద్యా సముపార్జనాసక్తులగు విద్యార్థులకు అసాధారణ ప్రతిభా పాటవములతో జ్ఞానప్రభలు కొలిపే మహనీయ మొర్తులైన ఉపాధ్యాయులకు పాదాభివందనము చేయుచు శుభాకాంక్షలు తెలియఁ జేయుచున్నాను.  

ఈ క్రింది గురుస్తోత్రములలో మనము గమనించుకొన్నచో గురువుకు కల అద్భుతమైన గౌరవము, ఆ గౌరవమును నిలుపుకొనుటకు తమపై ఉన్న గురుతర బాధ్యత గోచరించును.. అవి బాధ్యతాయుతమైన గురువులకు మాత్రమే స్పష్టమగును.
గురుత్వమును స్వీకరించినవారు త్రికరణశుద్ధిగా విద్యార్థులకు విద్యగరపినచో వారి ఋణము ధనాదులతో తీర్చుకొన గలిగెడిది కాదు. భావితరాలకు వేసెడి అద్భుతమైనపునాది గురువు వేయును.
తమవిధి నిర్వహణములో ఏమాత్రము అశ్రద్ధ వహించినను అట్టి గురువు తీసుకొనెడి ఒక్క రూప్యమయినను వ్యర్థమే. వెద్యార్థులు తమ భావికొఱకు ఎంతో ఆశతో తమకడకు వచ్చుదురు. వారి తల్లిదణ్డ్రులు ఎంతో ఆశతో గురువులకడ వారి పిల్లలను పెట్టుదురు. వారి ఆశలు అడియాసలు కారాదు. విద్యార్థుల సమయమునొక్క ఇమిషమైనను గురువు వ్యర్థపరచరాదు.
బాధ్యతాయుతముగా ప్రవర్తించుచున్న మహనీయులకు మరొక్కపర్యాయము పాదాభివందనమాచరించుచున్నాను.
గురు ప్రార్థన,
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ ||
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ ||
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ ||
చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౫ ||
సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజః |
వేదాంతాంబుజసూర్యో య: తస్మై శ్రీగురవే నమః || ౬ ||
చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాదకలాతీత: తస్మై శ్రీగురవే నమః || ౭ ||
జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః || ౮ ||
అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే |
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః || ౯ ||
శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః || ౧౦ ||
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || ౧౧ ||
మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః || ౧౨ ||
గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || ౧౩ ||

బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్ |
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి || ౧౪ ||
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ || ౧౪ ||
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.