గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, సెప్టెంబర్ 2018, సోమవారం

రసయాద్వయ,మృదుమానస,రసాయన,భీత చేతనాద్వయ,మౌనగీతి యుగళ,ధృతిరసయా,గర్భ"-సామ్యవాద"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
రసయాద్వయ,మృదుమానస,రసాయన,భీత చేతనాద్వయ,మౌనగీతి యుగళ,ధృతిరసయా,గర్భ"-సామ్యవాద"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                   
"-సామ్యవాద"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
మేనబ్రాణము దాల్చు జీవా!మేటి జ్ఞానివి నీవెగా!మేలు సర్వుల కోర వేలా?
తాను గొప్పగ దల్ప నేలా?తాడి నీడవు గాకుమా!దాలిగుంటలొ కుక్క గాకన్?
నేనునాదనహం బదేలా!నీటిమూటలుభోగముల్!నీలి మేఘము,చిన్కునట్లుం
మానవత్వం నిల్పుభూమిం!మాటనిల్కడ త్యాగతం!మాలివై!గను దేశఖ్యాతిం

మాలివై=కాపలాదారుడవై,దాలిగుంట=పాలుకాచుట కేర్పరచిన గుంట,
నీటిమూట=నీటియందలి మూట(నిష్ప్రయోజనము)

1,గర్భగత"-రసయా"-ద్వయవృత్తములు.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
1.మేన బ్రాణము దాల్చు జీవా!   2.మేలు సర్వుల కోర వేలా?
   తాను గొప్పగ దల్ప నేలా?          దాలిగుంటలొ కుక్క గాకన్?
  నేను నాదనహం బదేలా?           నీలి మేఘము చిన్కు నట్లున్!
 మానవత్వము నిల్పు భూమిన్!   మాలివై గను దేశ ఖ్యాతిన్!

2.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
మేటి జ్ఞానివి నీవెగా!
తాటి నీడవు గాకుమా!
నీటి మూటలు భోగముల్!
మాట నిల్కడ త్యాగతన్!

3.గర్భగత"-రసాయన"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మేన బ్రాణము దాల్చు జీవా!మేటి జ్ఞానివి నీవెగా?
తాను గొప్పగ దల్ప నేలా?తాటి నీడవు గాకుమా!
నేను నాద నహంబదేలా?నీటి మూటలు భోగముల్?
మానవత్వమునిల్పు భూమిన్! మాట నిల్కడ త్యాగతన్!

4.గర్భగత"భీత చేతనా"-దవ్య వృత్తములు.
అత్యష్టీఛందము.ర.స.య.జ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.మేటి జ్ఞానివి నీవెగా?మేలు సర్వుల కోర వేలా?
   తాటి నీడవు గాకుమా!దాలిగుంటలొ కుక్క గాకన్!
   నీటిమూటలు భోగముల్?నీలి మేఘము చిన్కు నట్లున్?
  మాట నిల్కడ త్యాగతం!మాలివై గను దేశ ఖ్యాతిన్!

2.మేటి జ్ఞానివి నీవెగా!మేన బ్రాణము దాల్చు జీవా!
   తాటి నీడవు గాకుమా!తాను గొప్పగ దల్ప నేలా?
   నీటి మూటలుభోగముల్!నేను నాద నహంబ దేల?
  మాట నిల్కడ త్యాగతం!మానవత్వము నిల్పు భూమిన్!

5.గర్భగత"-మౌనగీతి"-యుగళ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.స.య.జ.జ.మ.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
1,
మేటి జ్ఞానివి నీవెగా!మేలు సర్వుల గోర వేరా?మేన బ్రాణము దాల్చు జీవా!
తాటి నీడవు గాకుమా!దాలిగుంటలొ కుక్క గాకం!తాను గొప్పగ దల్ప నేలా?
నీటిమూటలుభోగముల్!నీలిమేఘము చిన్కు నట్లుం,నేనునాదనహంబదేలా!
మాట నిల్కడ త్యాగతం!మాలివై!గను దేశ ఖ్యాతిం?మానవత్వము  నిల్పు భూమిన్?
2.
మేటి జ్ఞానివి నీవెగా!మేనబ్రాణము దాల్చు జీవా!మేలు సర్వుల గోర వేలా?
తాడి నీడవు గాకుమా!తాను గొప్పగ!దల్పనేలా?దాలిగుంటలొ కుక్క గాకన్?
నీటి మూటలు భోగముల్!నేను,నాద నహం బదేలా!నీలి మేఘము చిన్కు నట్లున్?
మాటనిల్కడ త్యాగతం!మానవత్వము నిల్పు భూమిం!మాలివై గను దేశ ఖ్యాతిన్?

6.గర్భగత"-ధృతిరసయా"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మేలు సర్వుల కోర వేలా?మేన బ్రాణము దాల్చు జీవా!
దాలిగుంటలొ కుక్క గాకం!తాను గొప్పగ దల్ప నేలా?
నీలిమేఘము చిన్కు నట్లుం?నేను,నాద నహంబదేలా?
మాలివైగను దేశఖ్యాతిం!మానవత్వం నిల్పు భూమిన్?

7.గర్భగత"-యశోరసయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
మేలు సర్వుల కోరవేలా?మేనబ్రాణము దాల్చుజీవా!మేటిజ్ఞానివి నీవెగా?
దాలిగుంటలొ కుక్కగాకం!తాను గొప్పగ దల్పనేలా?తాడినీడవు గాకుమా!
నీలి మేఘము చిన్కు నట్లుం?నేను,నాద నహం బదేలా?నీటి మూటలు భోగముల్!                                                                                              
మాలివై గను దేశ ఖ్యాతిం!మానవత్వము నిల్పు భూమిం!మాట నిల్కడ త్యాగతన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒక్క వృత్తంలో ఇన్ని వృత్తములను ఇమిడ్చి రచించడం ప్రశంసనీయం.
అద్భుతముగా నున్నవి. సరస్వతీ పుత్రులకు ప్రణామములు. అందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.