గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, సెప్టెంబర్ 2018, గురువారం

రసయా,శ్రీభద్ర,రమతా,రసయారమ,నిక్షిప్త,రక్తిలు,రమసా,లోకతీరు,రమభా,తన్వినీ,గర్భ "-రామణీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.


రసయా,శ్రీభద్ర,రమతా,రసయారమ,నిక్షిప్త,రక్తిలు,రమసా,లోకతీరు,రమభా,తన్వినీ,గర్భ "-రామణీ"-వృత్త

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

      "-రామణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.మ.భ.ర.మ.లల.గణములు.యతులు.10,19.ప్రాసనీమముగలదు.
రక్తి గట్టెను రాక్షసత్వం!రమ్యతత్వం మట్టి గర్చెను!రామ మేదీ?లోకంబున!
శక్తి నందెను దుర్మదంబుం!సామ్య వాదం ఛేద మందెను!స్వామియేడీ?                                                                                                     కావంగను!                                                                                 
రక్తి భుక్తికి మూలమాయెం!రమ్యతేదీ?కల్యుగంబున!రామతత్వం రాదెంచను
రక్తి భక్తిని పెంచరండీ!రమ్య రామారక్షమాం సద!రామణీ!రక్షింపన్వలె?

1,గర్భగత"-రసయా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
రక్తి గట్టెను రాక్ష సత్వం!
శక్తి నందెను దుర్మదంబున్?
రక్తి భుక్తికి మూలమాయెన్!
రక్తి భక్తిని పెంచ  రండీ!

2.గర్భగత"-శ్రీభద్ర"-వృత్తము.
బృహతీఛందము.ర.మ.భ.గణములు.వృ.సం.387,ప్రాసగలదు.
రమ్య తత్వం మట్టి గర్చెను!
సామ్య వాదం!ఛేద మందెను!
రమ్యతేదీ?కల్యుగంబున!
రమ్య రామా!రక్షమాం!సద!

3.గర్భగత"-రమితా వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.మ.లల.గణములు.వృ.సం.195.ప్రాసగలదు
రామ మేదీ?లోకంబున!
స్వామి యేడీ?కావంగను!
రామ తత్వం రాదెంచను!
రా మణీ!రక్షింప న్వలె!

4.గర్భగత"-రసయారమ"-వృత్తము
ధృతిఛందము.ర.స.య.ర.మ.భ.గణములు.యతి,10,వ.యక్షరము.
ప్రాసనీమము గలదు.
రక్తిగట్టెను రాక్ష సత్వం ! రమ్య తత్వం మట్టి గర్చెను!
శక్తి నందెను దుర్మదంబుం!సామ్య వాదం ఛేద మందెను!
రక్తి భుక్తికి మూలమాయెం!రమ్య తేదీ?కల్యుగంబున!
రక్తి భక్తిని పెంచ రండీ! రమ్య రామా!రక్షమాం సద!

5.గర్భగత"-నిక్షిప్త"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.మ.భ.ర.మ.లల.గణములు.యతి.10,వ.యక్షరము
ప్రసనీమముగలదు.
రమ్య తత్వం మట్టి గర్చెను!రామ మేదీ?లోకంబున!
సామ్యవాదం ఛేదమందెను!స్వామి యేడీ?కావంగను!
రమ్య తేదీ?కల్యుగంబున!రామ తత్వం రా దెంచన్?
రమ్య రామా!రక్షమాం సద!రామణీ!రక్షింపం వలె?

6.గర్భగత"-రక్తిలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.మ.భ.ర.మ.స.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
రమ్య తత్వం మట్టి గర్చెను!రామ మేదీ?లోకంబున!రక్తి గట్టెను రాక్షసత్వం!
సామ్యవాదం ఛేదమందెను!స్వామియేడీ!కావంగను!శక్తి నందెనుదుర్మదంబుం
రమ్యతేదీ?కల్యుగంబున!రామతత్వం రాదెంచం!రక్తి భుక్తికి మూలమాయెం!
రమ్యరామా!రక్షమాం సద!రామణీ!రక్షింపంవలె!రక్తి భక్తిని పెంచ రండీ!

7.గర్భగత"-రమసా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.మ.స.జ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
రామ  మేదీ! లోకంబున!  రక్తి  గట్టెను రాక్ష  సత్వం!
స్స్వామి యేడీ?కావంగను!శక్తి నందెను దుర్మదంబున్?
రామతత్వం రాదెంచం?రక్తి భుక్తికి మూల మాయెన్?
రామణీ!రక్షింపం వలె? రక్తి భక్తిని పెంచ రండీ!

8.గర్భగత"-లోకతీరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.మ.స.జ.జ.మ.య.ర.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
రామ మేదీ?లోకంబున!రక్తి గట్టెను రాక్షసత్వం!రమ్య తత్వం మట్టి గర్చెను!
స్వామి యేడీ?కావంగను!శక్తినందెను దుర్మదంబుం!సామ్య వాదం ఛేదమందెను!
రామతత్వం రా దెంచం!రక్తి భుక్తికి మూలమాయెం?రమ్యతేదీ!కల్యుగంబున?
రామణీ!రక్షింపం వలె!రక్తి భక్తిని పెంచ రండీ? రమ్య రామా! రక్ష మాం!సద!

9.గర్భగత"-రమభా"-వృత్తము.
ధృతిఛందము.ర.మ.భ.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
రమ్య తత్వము మట్టి గర్చెను!రక్తి గట్టెను రాక్షసత్వం!
సామ్యవాదం ఛేదమందెను!శక్తి నందెను దుర్మదంబున్?
రమ్యతేదీ?కల్యుగంబున!రక్తి భుక్తికి మూల మాయెన్?
రమ్య రామారక్షమాం! సద!రక్తి భక్తిని పెంచరండీ!

10,గర్భగత"-తత్వనీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.మ.భ.ర.స.య.ర.మ.లల.గణములు.యతులు.10,19,
ప్రాసనీమముగలదు
రమ్యతత్వము మట్టి గర్చెను!రక్తి గట్టెను రాక్షసత్వం!రామ మేదీ?లోకంబున!
సామ్యవాదము ఛేదమందెను!శక్తినందెను దుర్మదంబుం?స్వామి యేడీ? కావంగను!
రమ్యతేదీ?కల్యుగంబున!రక్తి భుక్తికి మూలమాయెం!రామతత్వంరాదెంచను?
రమ్య!రామా!రక్షమాం!సద!రక్తి భక్తిని పెంచరండీ!రామణీ రక్షింపం వలె?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" రమ్య తత్వము రక్తిగట్టెను
సామ్య వాదము ఛేదమందెను " బాగుంది అన్ని వృత్తములు అలరించు చున్నవి .
ఇన్నిరోజులు " లడ్డూలు ముందరపెట్టి మూతికట్టేసినట్టు " బాధగా అనిపించింది. వ్రాసే వ్యాఖ్య కంటే చదివిన ఆనందమే ఎక్కువ
ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.