జైశ్రీరామ్.
శ్లో. స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుఃస్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
తే.గీ. మూర్ఖులింటిలోపలననే పూజలందు.
గ్రామమందునే పూజలు గాంచు ప్రభువు.
రాజు తన దేశమందునే రాణఁ గాంచు.
పూజ్య విద్వాంసులెల్లెడన్ పూజలందు
భావము.
మూర్ఖుఁడు తన ఇంటిలోనే పూజింపఁబడును. ప్రభువు తన గ్రామమునందే పూజింపఁబడును. రాజు తన దేశమునందే పూజింపఁబడును. కాని విద్వాంసుఁడు మాత్రము అన్నిచోటులందూ పూజింపఁబడును.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అదే విద్వాంసులకున్న ఘనత ఆ విలువను గుర్తించ లేని పామరుల కున్న న్యూనత
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.