జైశ్రీరామ్.
సద్బుధ, జడిపిలు,నమ్మిక,సబబా,సజ్జమ,కానని చేష్ట,తారణమెంచ,తృళ్ళు యశలా,కారణజన్మ,గర్భ "-నీతిగమన"-వృత్తమురచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-నీతిగమన"-వృత్తము.
ఉత్కృతిఛందము.స,భ.భ.స.జ.ర.స.భ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
ఘను డేనంచును తృళ్ళకు!కనరాని చేష్ట లేల?కారణ జన్ముండవు సుమ్మీ?
ధనమే! మేలన బోకుమి?తనియంగ సౌఖ్యమెంచు?తారణ మెంచన్వలె జీవా!
మననీయుండవు,గావొకొ!మను,గౌరవంబుపెంచి!మారణమెంచన్వలదోయీ!
జననిం మెచ్చుమి!నిచ్చెలు!చను,మంచి నెంచి నిచ్ఛ!జారుల భేదించుమి శూరా!
1.గర్భగత"- సద్బుధ"-వృత్తము.
బృహతీఛందము.స.భ.భ.గణములు.వృ.సం.436.ప్రాసగలదు.
ఘనుడేనంచును తృళ్ళకు?
ధనమే!మేలనబోకుమి?
మన నీయుండవు గావొకొ?
జననిం మెచ్చుమి నిచ్చెలు!
2.గర్భగత"-జడిపిలు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.జ.గగ.గణములు.వృ.సం.44.ప్రాసగలదు.
కనరాని చేష్ట లేల?
తనియంగ సౌఖ్యమెంచు!
మను గౌరవంబు పెంచి!
చను, మంచినెంచి నిచ్ఛ!
3.గర్భగత"-నమ్మిక"-వృత్తము.
బృహతీఛందము.భ.త.య.గణములు.వృ.సం.103.ప్రాసగలదు.
కారణ జన్ముండవు సుమ్మీ?
తారణ మెంచన్వలె జీవా?
మారణ మెంచన్వలదోయీ?
జారుల భేదించుమి శూరా!
4.గర్భగత"-సబబా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.భ.స.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఘనుడేనంచును తృళ్ళకు! కనరాని చేష్టల!
ధనమే!మేలనబోకుమి!తనియంగ సౌఖ్య మెంచు!
మననీయుండవు గావొకొ?మను గౌరవంబు పెంచి!
జననిం మెచ్చుమి నిచ్చెలు!చను మంచి నెంచి నిచ్ఛ!
5.గర్భగత"-సజ్జమ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.జ.మ.స.భ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కనరాని చేష్టలేలా? కారణ జన్ముండవు సుమ్మీ?
తనియంగ సౌఖ్య మెంచు! తారణ మెంచన్వలె జీవా!
మను గౌరవంబు పెంచి! మారణ మెంచన్వలదోయీ?
చను మంచి నెంచి నిచ్ఛ! జారుల భేదించుమి శూరా!
6.గర్భగత,లఘ్వంత"-కాననిచేష్ట"-
ఉత్కృతిఛందము.స.జ.మ.స.భ.త.య.స.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కనరాని చేష్ట లేలా?కారణ జన్ముండవు సుమ్మీ?ఘనుడేనంచును తృళ్ళకు!
తనియంగ సౌఖ్యమెంచు!తారణమెంచన్వలె?జీవా!ధనమే!మేలనబోకుమి?
మను గౌరవంబు పెంచి!మారణ మెంచన్వలదోయీ?మన నీయుండవుగావొకొ?
చను మంచి నెంచి నిచ్ఛ!జారుల భేదించుమి శూరా!జననిం మెచ్చుమినిచ్చెలు!
7.గర్భగత"-తారణమెంచ"-వృత్తము.
ధృతిఛందము.భ.త.య.స.భ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కారణ జన్ముండవు సుమ్మీ?ఘనుడేనంచును తృళ్ళకు!
తారణ మెంచన్వలె?జీవా!ధనమే!మేలన బోకుమి?
మారణ మెంచన్వలదోయీ?మననీయుండవు గావొకొ?
జారుల భేదించుమి శూరా!జననిం మెచ్చుమి నిచ్చెలు!
8.గర్భగత లఘ్వంత"-తృళ్ళు"-
ఉత్కృతిఛందము.భ.త.య.స.భ.భ.స.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కారణ జన్ముండవు సుమ్మీ?ఘను డేనంచును తృళ్ళకు!కనరాని చేష్టలేల?
తారణ మెంచన్వలె?జీవా!ధనమే!మేలన బోకుమి?తనియంగ సౌఖ్యమెంచు!
మారణ మెంచన్వలదోయీ?మననీయుండవు గావొకొ?మను,గౌరవంబు పెంచి!
జారుల భేదించుమి శూరా!జననిం మెచ్చుమి నిచ్చెలు!చను మంచెంచి నిచ్ఛ!
9,గర్భగత"-యశలా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.జ.త.య.స.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కనరాని చేష్ట లేల?ఘను డేనంచును తృళ్ళకు!
తనియంగ సౌఖ్య మెంచు!ధనమే!మేలన బోకుమి?
మను,గౌరవంబు పెంచి!మన నీయుండవు గావొకొ?
చను,మంచెంచి నిచ్ఛ!జననిం మెచ్చుమి నిచ్చెలు!
10,గర్భగత"-కారణ జన్మ"-వృత్తము
ఉత్కృతిఛందము.స.జ.త.య.స.స.స.భ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కనరాని చేష్టలేల?ఘను డేనంచును తృళ్ళకు! కారణ జన్ముండవు సుమ్మీ?
తనియంగ సౌఖ్యమెంచు!ధనమే!మేలన బోకుమి?తారణ మెంచన్వలె జీవా!
మను,గౌరవంబు పెంచి!మననీయుండవు గావొకొ?మారణ మెంచన్వలదోయీ?
చను,మంచెంచి నీచ్ఛ!జననిం మెచ్చుమి నిచ్చెలు! జారుల భేదించుమిశూరా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
" ఘనుడే నంచును తృళ్ళకు " అంటూ నీతిగమన వృత్తము [అన్ని వృత్తములలోను ] అలరించు చున్నది . పండితు లిరువురికీ అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.