గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జులై 2018, శుక్రవారం

రసయాద్వయ,ఆనంద,రసయారస,శుద్ధమౌద్వయ,మోదమికద్వయ,రసయాద్వయ,రసయశా,గర్భ"-ముద్దూముచ్చట"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

 జైశ్రీరామ్.
రసయాద్వయ,ఆనంద,రసయారస,శుద్ధమౌద్వయ,మోదమికద్వయ,రసయాద్వయ,రసయశా,గర్భ"-ముద్దూముచ్చట"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-ముద్దూముచ్చట"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.మ.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
ముద్దుముచ్చట తీర కుండం?ముండమోసెను సంస్కారం?మోదమేదిక! భారతాంబా?
హద్దుపద్దులు లేక యొప్పెం?అండదండల స్వార్ధంబుం?యాదుకోగలవారు లేరా?
పద్దుమాలిన వారి ప్రజ్ఞం! పండె పాపం! స్వేచ్ఛేదీ?వాదిలంగను శక్తి లేదా?
శుద్ధ మౌనొకొ?వేచిచూడం?చుండు బోతుల ప్రాబల్యం?శోధిలం వడి పూను కొమ్మా?

1.గర్భగత"-రసయా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
ముద్దుముచ్చట తీరకుండం?
హద్దు పద్దులు లేక యొప్పెన్?
పద్దు మాలిన వారి  ప్రజ్ఞం?
శుద్ధమౌనొకొ?వేచిచుడన్?

2.గర్భగత"-ఆనంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.గగ.గణములు.వృ.సం.27.ప్రాసగలదు.
ముండమోసెను సంస్కారం?
అండదండలు స్వార్ధంబున్?
పండె పాపము!   స్వేచ్ఛేదీ?

3.గర్భగత"-రసయా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91,ప్రాస గలదు.
మోదమేదిక?భారతాంబా?
యాదుకోగలవారు లేరా?
వాదిలంగను శక్తి లేదా?
శోధిలం వడి పూను కొమ్మా?

4.గర్భగత"-రసయారస"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.స.గగ.గణములు.యతి.10,వ,యక్షరము.
ప్రాసనీమముగలదు.
ముద్దుముచ్చట తీరకుండం?ముండమోసెను సంస్కారం?
హద్దుపద్దులు లేక యొప్పెం?యండ దండల స్వార్ధంబున్?
పద్దు మాలిన వారి  ప్రజ్ఞం?  పండె పాపము స్వేచ్ఛేదీ?
శుద్ధమౌనొకొ?వేచి చూడం?చుండు బోతుల ప్రాబల్యం?

5.గర్భగత"-శుద్ధమౌ"-ద్వయ వృత్తములు.
అత్యష్టీఛందము.ర.స.మ.జ.జ.గగ.గణములు.యతి,9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.ముండమోసెను సంస్కారం?మోద మేదిక ? భారతాంబా?
యండదండల స్వార్ధంబుం?యాదుకో గలవారు లేరా?
పండె పాపము స్వేచ్ఛేది? వాదిలం గను శక్తి లేదా?
చుండు బోతుల ప్రాబల్యం!శోధిలం వడి పూనుకొమ్మా?

2.ముండమోసెను సంస్కారం?ముద్దు ముచ్చట తీరకుండన్?
   యండదండల స్వార్ధంబుం? హద్దు పద్దులు లేక! యొప్పెన్?
   పండె పాపం!   స్వేచ్ఛేదీ?    పద్దు మాలిన వారి ప్రజ్ఞన్?
  చుండు బోతుల ప్రాబల్యం?శుద్ధ మౌనొకొ?వేచిచూడన్?

6.గర్భగత"-మోదకమిక"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.స.మ.జ.జ.మ.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
1.ముండమోసెను సంస్కారం?మోద మేదిక భారతాంబా?ముద్దు ముచ్చట తీరకుండన్?
యండదండల స్వార్ధంబుం?యాదుకో గలవారు లేరా?హద్దు పద్దులు లేక యొప్పెన్?
పండె పాపం స్వేచ్ఛేదీ?వాదదిలంగను శక్తి లేదా? పద్దుమాలిన వారిప్రజ్ఞన్?
చుండుబోతుల ప్రాబల్యం? శోధిలం వడి పూను కొమ్మా?.  శుద్ధమౌనొకొ? వేచి చూడన్?

2.ముండమోసెను సంస్కారం?ముద్దు ముచ్చట తీరకుండం?మోదమేదిక భారతాంబా?
 యండ దండలు స్వార్ధంబుం?హద్దు పద్దులు లేక యొప్పెం?యాదుకోగల వారు లేరా?
 పండె పాపం స్వేచ్ఛేదీ?పద్దుమాలిన వారి ప్రజ్ఞం?వాదిలంగను శక్తి లేదా?
 చుండుబోతుల ప్రాబల్యం?శుద్ధమౌనొకొ?వేచి చూడం?శోధిలం వడి  పూను కొమ్మా?

7.గర్భగత"-రసయాద్వయ"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.య.గణములు.యతి.10,ప్రాసగలదు.
మోదమేదిక భారతాంబా?ముద్దు ముచ్చట తీరకుండన్?
యాదుకో గలవారు లేరా?హద్దు పద్దులు లేక యొప్పెన్?
వాదిలంగను శక్తి లేదా?  పద్దు మాలిన వారి  ప్రజ్ఞన్?
శోధిలం వడి పూను కొమ్మా?శుద్ధ మౌనొకొ? వేచిచూడన్?

8.గర్భగత"-రసయశా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.ర.స.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
మోదమేదిక భారతాంబా?ముద్దు ముచ్చట తీరకుండం?ముండ మోసెను సంస్కారం?
యాదుకో గలవారు లేరా?హద్దు పద్దులు లేక యొప్పెం?యండదండల,,  స్వార్ధంబున్?
వాదిలంగను శక్తి లేదా?పద్దుమాలినవారి ప్రజ్ఞం!పండె పాపము!స్వేచ్ఛేదీ?
శోధిలం వడి పూను కొమ్మా?శుద్ధమౌనొకొ? వేచిచూడం?చుండుబోతుల ప్రాబల్యం?
స్వస్తి.


మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.