గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జులై 2018, సోమవారం

శమనా,రనలా,నీరజాక్ష,మసలు,యెరుగు,మాయజా,జగన్మాయా,జనన,వర్ధిలు,మాయాజగ,కదలాడు,మాయామర్మ,చరితమా,తురుము,గర్భ"-శ్రేయోభిలాషిణీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
శమనా,రనలా,నీరజాక్ష,మసలు,యెరుగు,మాయజా,జగన్మాయా,జనన,వర్ధిలు,మాయాజగ,కదలాడు,మాయామర్మ,చరితమా,తురుము,గర్భ"-శ్రేయోభిలాషిణీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-శ్రేయోభిలాషిణీ"-వృత్తము

ఉత్కృతిఛందము.ర.జ.ర.న.జ.భ.జ.న.గల.గణములు.యతులు.14,19.
ప్రాసనీమముగలదు.
మాయలోన పుట్టి!మాయలోన పెరిగి!మాయయే!జగమటంచు మసలె దేల?
మాయ మాయె గాదె?మా"-యధీన మదియె!మాయ దేలకుమ!టంగు తినెద వీవు,?
మాయ చెంచు లక్ష్మి!మాయ కీర్తి చెరచు?మాయ భోగదమ?మబ్బుతెరగు!  వీడు?
మాయ భీతిదంబు!మాయ మర్మ మయము!మాయ శ్రేయమ!మంచిని తెగ టార్చు!

1.గర్భగత"-శమన"-వృత్తము.
గాయిత్తీఛందము.ర.జ.గణములు.వృ.సం.43.ప్రాసగలదు.
మాయ లోన పుట్టి!
మాయ మాయె గాదె?
మాయ చెంచు లక్ష్మి!
మాయ భీతిదంబు?

2.గర్భగత"-రనలా"-వృత్తము.
ఉష్ణిక్ఛందము.ర.న.ల.గణములు.వృ.సం.123.ప్రాసగలదు.
మాయలోన పెరిగి!
మా"యధీన మదియె?
మాయ కీర్తి చెరచు!
మాయ మర్మ మయము!

3.గర్భగత"-నీరజాక్ష"-వృత్తము.
గాయిత్రీఛందము.ర.న.గణములు.వృ.సం.59.ప్రాసగలదు.
మాయయే జగమ?
మాయదేలకుమ!
మాయ భోగదమ?
మాయ శ్రేయమ?

4.గర్భగత"-మసలు"-వృత్తము.
అతిజగతీఛందము.ర.న.భ.స.ల.గణములు.యతి.6.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాయయే!జగ మటంచు మసలె దేల?
మాయ దేలకుమ టంగు తినెద వీవు!
మాయ భోగదమ?మబ్బు తెరగు వీడు?
మాయ శ్రేయమమంచినని తెగటార్చు!

5.గర్భగత"-యెరుగు"-వృత్తము.
అతిజగతీఛందము.ర.జ.ర.న.ల.గణములు.యతి.7.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాయలోన పుట్టి! మాయ లోన పెరిగి!
మాయ మాయ గాదె?మా"యధీన మదియె!
మాయ చెంచు లక్ష్మి!మాయ కీర్తి చెరచు?
మాయ భీతిదంబు!మాయ మర్మ మయము!

6.గర్భగత"-మాయజా"-వృత్తము.
జగతీఛందము.ర.న.ర.జ.గణములు.యతి.7.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాయయే!జగమ!మాయలోన పుట్టి?
మాయ దేలకుమ!మాయ మాయ గాదె?
మాయ భోగదమ?మాయ చెంచు లక్ష్మి!
మాయ శ్రేయమ?మాయ భీతిదంబు!

7.గర్భగత"-జగన్మాయా"-వృత్తము.
అతిధృతిఛందము.ర.న.ర.జ.ర.న.ల.గణములు.యతులు.7.13.
ప్రాసనీమముగలదు.
మాయయే!జగమ?మాయలోన పుట్టి!మాయలోన పెరిగి!
మాయ దేలకుమ?మాయ మాయ గాదె!మా"యధీన మదియె?
మాయ భోగదమ?మాయ చెంచు లక్ష్మి!మాయ కీర్తి చెరచు!
మాయ శ్రేయమ?మాయ భీతిదంబు!మాయ మర్మ మయము!

8.గర్భగత"-జనన"-వృత్తము.
అతిజగతీఛందము.ర.న.జ.భ.ల.గణములు.యతి.8.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాయలోన పెరిగి!మాయయే!జగమ?
మా"యధీన మదియె?మాయ దేలకుమ!
మాయ కీర్తి చెరచు!మాయ భోగదమ?
మాయ మర్మ మయము!మాయ శ్రేయమ?

9.గర్భగత"-వర్ధిలు"-వృత్తము.
కృతిఛందము.ర.న.జ.భ.జ.న.గల.గణములు.యతి.13.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాయలోన పెరిగి !మాయయే?జగమటంచు మసలె దేల?
మాయధీన మదియె?మాయ దేలకుమ టంగుతినె దీవు?
మాయ కీర్తి చెరచు?మాయ భోగదమ?మబ్బు తెరగు వీడు?
మాయ మర్మ మయము!మాయ శ్రేయమ?మంచిని తెగటార్చు?

10,.గర్భగత"-మాయాజగ"-వృత్తము.
అతిధృతిఛందము.ర.జ.ర.న.భ.స.ల.గణములు.యతులు.7,12.
ప్రాసనీమముగలదు.
మాయలోన పుట్టి!మాయయే?జగమటంచు మసలె దేల?
మాయ మాయ గాదె?మాయ దేలకుమ టంగు తినెదీవు?
మాయ చెంచు లక్ష్మి?మాయ భోగదమ?మబ్బు తెరగు వీడు?
మాయ భీతిదంబు?మాయ శ్రేయమ?మంచిని తెగటార్చు!

11.గర్భగత"-కదలాడు"-వృత్తము.
అతిధృతిఛందము.ర.న.భ.స.జ.ర.ల.గణములు.యతులు.6,14.
ప్రాసనీమముగలదు.
మాయయే!జగమటంచు మసలె దేల?మాయలోన పుట్టి!
మాయ దేలకుమ!టంగుతినె దీవు?మాయ మాయ గాదె?
మాయ భోగదమ?మబ్బు తెరగు వీడు?మాయ చెంచు లక్ష్మి?
మాయ శ్రేయమ? మంచిని తెగటార్చు!మాయ భీతిదంబు?

12.గర్భగత"-మాయామర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.భ.స.జ.ర.జ.భ.లల.గణములు.యతులు.14,20.
ప్రాసనీమముగలదు.
మాయయే!జగమటంచు మసలెదేల?మాయలోన పుట్టి!మాయలోన పెరిగి?
మాయదేలకుమ!టంగు తినెదీవు?మాయ మాయగాదె?మాయధీనమదియె?
మాయభోగదమ?మబ్బుతెరగు వీడు?మాయ చెంచులక్ష్మి?మాయకీర్తి;చెరచు
మాయశ్రేయమ!మంచిని,తెగటార్చుమాయభీతిదంబు,మాయ,మర్మ మయము?

13.గర్భగత"-చరితమా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.భ.స.జ.భ.లల.గణములు.యతులు.12,20.
ప్రాసనీమముగలదు.
మాయలోన పుట్టి!మాయయే!జగమటంచు మసలెదేల?మాయలోన పెరిగి?
మాయమాయ గాదె?మాయ దేలకుమ!టంగు తినెదీవు!మా యధీన మదియె
మాయ కీర్తి చెరచు!మాయ భోగదమ?మబ్బు తెరగు వీడు? మాయ  చెంచులక్ష్మి?                                                  
మాయ మర్మ మయము!మాయ శ్రేయదమ?మంచిని తెగటార్చు? మాయ భీతిదంబు?

14.గర్భగత"-తురుము"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.ర.జ.ర.న.జ.న.గల.గణములు.యతులు.7.13.
ప్రాసనీమముగలదు.
మాయయే!జగమ?మాయలోన పుట్టి మాయలోన పెరిగి టంచు?మసలెదేల?
మాయదేలకుమ?మాయమాయ గాదె?మా'యధీన మదియె?టంగు తినెదీవు
మాయభోగదమ?మాయ కీర్తిచెరచు!మాయ చెంచు లక్ష్మి?మబ్బుతెరగువీడు!
మాయ శ్రేయదమ?మాయ మర్మమయము?మాయభీతిదంబుమంచిని తెగటార్చు?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.