జైశ్రీరామ్.
గతికాద్వయ,లీలా,హీనజీ వ,భాషణాయుగళ,నిరర్ధకద్వ య,నరజయుగళీ,పరువునిల్పు గర్భ"-జ్ఞానహీన"-వృత్త మ.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
జ్ఞానహీన వృత్తము
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.న.భ.స.జ. గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
చరిత హీన జీవ మేల?జ్ఞాన హీను జప మేల?చతుర హీన భాషణేల?
తరుణి హింస పాప మేల?దాన హీను బ్రతుకేల?తతుల దోష చర్యదేల?
గురుతు లేని మాట లేల?గోనె నింపు ధనమేల?కుతల నింద పొంద నేల?
పరువు నిల్పు మానవుండ!ప్రాణమెంత?తృణమేగ!బ్రతు కు మంచినెంచు జీవ!
1.గర్భగత"-గతికా ద్వయ వృత్తములు.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం. 344.ప్రాసగలదు.
1.చరిత హీన జీవ మేల? 2.చతుర హీన భాషణేల?
తరుణి హింస పాప మేల? తతుల దోష చర్యదేల?
గురుతు లేని మాట లేల? కుతల నింద పొంద నేల?
పరువు నిల్పు మానవుండ! బ్రతుకు మంచి నెంచు జీవ!
2.గర్భగత"-లీలా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.న.గల.గణములు. వృ.సం.187.ప్రాసగలదు.
జ్ఞాన హీను జప మేల?
దాన హీను బ్రతుకేల?
గోనె నింపు ధన మేల?
ప్రాణమెంత?తృణమేగ!
3.గర్భగత"-హీనజీవ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.న.గల. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చరిత హీన జీవ మేల?జ్ఞాన హీను జప మేల?
తరుణి హింస పాప మేల?దాన హీను బ్రతుకేల?
గురుతు లేని మాట లేల?గోనెననింపు ధన మేల?
పరువు నిల్పు మానవుండ!ప్రాణమెంత?తృణమేగ!
4.గర్భగత"-భాషణా"-యుగళ వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.భ.స.జ.గల. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.జ్ఞాన హీను జప మేల?చతుర హీను భాషణేల?
దాన హీను బ్రతు కేల?తతుల దోష చర్య దేల?
గోనె నింపు ధన మేల?కుతల నింద పొంద నేల?
ప్రాణ మెంత?తృణమేగ!బ్రతుకు మంచినెంచు జీవ!
2. జ్ఞాన హీను జప మేల?చరిత హీను జీవ మేల?
దాన హీను బ్రతుకేల? తరుణి హింస పాప మేల?
గోనె నింపు ధన మేల?గురుతు లేని మాట లేల?
ప్రాణ మెంత?తృణ మేగ!పరువు నిల్పు మానవుండ?
5.గర్భగత"-నిరర్ధక"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.న.భ.స.జ.భ.స.జ. గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జ్ఞాన హీను జప మేల?చతుర హీను భాష ణేల?చరిత హీను జీవ మేల?
దాన హీను బ్రతు కేల?తతుల దోష చర్యదేల?తరుణి హింస పాపమమేల?
గోనె నింపు ధన మేల?కుతల నింద పొంద నేల?గురుతు లేని మాట లేల?
ప్రాణ మెంత?తృణ మేగ!బ్రతుకు మంచి నెంచు జీవ!పరువు నిల్పు మాన వుండ!
2.
జ్ఞాన హీను జప మేల?చరిత హీను జీవ మేల?5చతుర హీను భాషణేల?
దాన హీను బ్రతుకేల?తరుణి హింస పాప మేల?తతుల దోష చర్యదేల?
గోనె నింపు ధన మేల?గురుతు లేని మాట లేల?కుతల నింద పొంద నేల?
ప్రాణ మెంత?తృణమేగ!పరువు నిల్పు మానవుండ!బ్రతుకు మంచి నెంచు జీవ!
6.గర్భగత"-నరజ యుగళీ"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.న.ర.జ.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చతుర హీను భాషణేల?చరిత హీను జీవ మేల?
తతుల దోష చర్యదేల?తరుణి హింస పాప మేల?
కుతల నింద పొంద నేల?గురుతు లేని మాట లేల?
బ్రతుకు మంచి నెంచు జీవ!పరువు నిల్పు మానవుండ!
7.గర్భగత"-పరువు నిల్పు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ.ర.న. గల.గణములుయతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చతుర హీను భాషణేల?చరిత హీను జీవ మేల?జ్ఞాన హీను జప మేల?
తతుల దోష చర్యదేల?తరుణి హింస పాప మేల?దాన హీను బ్రతుకేల?
కుతల నింద పొంద నేల?గురుతు లేని మాట లేల?గోనెనిఉంపు ధనమేల?
బ్రతుకు మంచి నెంచు జీవ!పరవు నిల్పు మానవుండ!ప్రాణమెంత? తృణమేగ!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.