గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జులై 2018, శుక్రవారం

భాసిజ,జ్ఞాననేత్ర,మత్తరజినీ,నధర్మ,సాయజ,నిస్వర,స్ఫూర్తినీ,నేతెంచు,భాసయాన,నీవినాపు,గర్భ"-నేర్మిదూర"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.

భాసిజ,జ్ఞాననేత్ర,మత్తరజినీ,నధర్మ,సాయజ,నిస్వర,స్ఫూర్తినీ,నేతెంచు,భాసయాన,నీవినాపు,గర్భ"-నేర్మిదూర"-వృత్తము.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"నేర్మిదూర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.భ.స.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కన్న కొడుకు వెన్నపూస!కాల గతిని మారులే!కన్న జన్మ దుష్కృతంబదే?
చెన్నొదవును చిత్ర మేమొ?చీలి మమత చేటునం?చేర్మి నేర్మి దూరమోపగా!
పన్నములను వల్లెవేయు!వాళక మది వేరులే?పర్మునైన లెక్క జేయకన్?
కన్న సుతుల చిన్న చూపు?కాలము కలి చైదమై?కర్మ చేతనం బదేలనో?

చేర్మి=చేరిక,నేర్మి=నేర్పు,పర్మునైన=పరమాత్మునైన,చైదము=చేష్ట,


1.గర్భగత"-భాసిజ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.జ.గణములు.వృ.సం.351.ప్రాసగలదు.
కన్న కొడుకు వెన్న పూస!
చెన్నొదవును చిత్ర మేమొ?
పన్నములను వల్లె వేయు!
కన్న సుతుల చిన్న చూపు?

2.గర్భగత"-జ్ఞాన నేత్ర వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.స.లగ.గణములు.వృ.సం.94.ప్రాసగలదు.
కాలగతిని మారులే?
చీలి మమత చేటునన్?
వాళక మది వేరులే?
కాలము కలి చైదమై!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
కర్మ జన్మ దుష్కృతంబదే?
చేర్మి నేర్మి దూర మోపగన్?
పర్ము నైన లెక్క జేయకన్?
కర్మ చేతనం బదేలనో?

4.గర్భగత"-నధర్మ "-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.జ.భ.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
కన్న కొడుకు వెన్న  పూస!   కాలగతిని మారులే?
చెన్నొదవును చిత్ర మేమొ?చీలి మమత చేటునన్?
పన్నములను వల్లె వేయు!వాళక మది వేరులే?
కన్న సుతుల చిన్న చూపు!కాలము కలి చైదమై!

5.గర్భగత"-సాయజ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.య.జ.ర.లగ.గణమలు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కాలగతిని మారులే?కర్మ జన్మ దుష్కృతంబదే?
చీలి మమత చేటునం?చేర్మి  నేర్మి దూర మోపగన్?
వాళక మది వేరులే!పర్ము నైన  లెక్క జేయకన్?.
కాలము కలిచైదమై!  కర్మ చేతనం  బదేలనో?

6.గర్భగత"-నిస్వర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.య.జ.ర.య.న.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కాలగతిని మారులే?కర్మ జన్మ దుష్కృతంబదే?కన్న కొడుకు వెన్న పూస!
చీలి మమత చేటునం?చేర్మి నేర్మి దూరమోపగం?చెన్నొదవును చిత్రమేమొ?
వాళక మది వేరులే!పర్ము నైన లెక్క జేయకం?పన్నములను వల్లె వేయు!
కాలము కలి చైదమై!కర్మ చేతనం బదేలనో?కన్న సుతుల చిన్న చూపు!

7.గర్భగత"స్ఫూర్తినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కర్మ జన్మ దుష్కృతంబదే?కన్న కొడుకు వెన్న పూస!
చేర్మి నేర్మి దూరమోపగం?చెన్నొదవును చిత్ర మేమొ?
పర్ము నైన లెక్క జేయకం?పన్నములను వల్లె వేయు!
కర్మ చేతనం బదేలనో?కన్న సుతుల చిన్న చూపు!

8.గర్భగత"-నేతెంచు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.స.జ.భ.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కర్మ జన్మ దుష్కృతంబదే?కన్న కొడుకు వెన్నపూస!కాలగతిని మారులే?
చేర్మి నేర్మి దూర మోపగం?చెన్నొదవును చిత్ర మేమొ?చీలి మమత చేటునం?
పర్ము నైన లెక్క జేయకం?పన్నములను వల్లె వేయు!వాళక మది వేరులే!
కర్మ చేతనం బదేలనో?కన్న సుతుల చిన్న చూపు!కాలము కలి చైదమై!

9.గర్భగత"-భాసయాన"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.య.న.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కాల గతిని మారులే?కన్న కొడుకు వెన్న పూస!
చీలి మమత చేటునం?చెన్నొదవును చిత్ర మేమొ?
వాళక మది వేరులే!పన్నములను వల్లె వేయు!
కాలము కలి చైదమై!కన్న సుతుల చిన్న చూపు!

10,గర్భగత"-నీవినాపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.య.న.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు9,18.
.ప్రాసనీమముగలదు.
కాల గతిని మారులే?కన్న కొడుకు వెన్న పూస!కర్మ జన్మ దుష్కృతంబదే?
చీలి మమత చేటునం?చెన్నొదవును చిత్ర మేమొ?చేర్మి నేర్మి దూరమోపగన్?
వాళక మది వేరులే?పన్నములను వల్లె వేయు!పర్ము నైన లెక్క జేయకన్?
కాలము కలి చైదమై!కన్న సుతుల చిన్న చూపు!కర్మ చేతనం బదేలనో?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.