గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జులై 2018, మంగళవారం

ప్రమాణీద్వయ,మత్తరజినీ,భ్రాంతినీ,ప్రతీక,శతాయు,సత్యమేవ,కోటిసూర్య,సూర్యభా,కాంతిలు గర్భ"శమంతక"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

ప్రమాణీద్వయ,మత్తరజినీ,భ్రాంతినీ,ప్రతీక,శతాయు,సత్యమేవ,కోటిసూర్య,సూర్యభా,కాంతిలు గర్భ"శమంతక"-వృత్తము.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-శమంతక"-వృత్తము.
అభికృతిఛందము.జ.ర.జ.జ.ర.జ.ర.జ.గ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
శమాంత కాంత కాంతులం?శతకోటి సూర్య భాసిభా!శతాయు వీయు, సత్యమే?                                                                                                  
విమాన భ్రాంతి శోభినీ?వెతలంట నీనీ జీవనీ!పితుంగ నీయు క్షీరమున్?
ప్రమోద మోద మోదముం?వ్రతనిష్ట బ్రోచు భార్గవిం?ప్రతీక జన్మ ధన్యనీ?
శ్రమంబుగాదు పొందగా!చతురంత యాన భామినిం?వ్రతానుగుణ్య వర్తినిన్?

1.గర్భగత"-ప్రమాణీ"-ద్వయ వృత్తములు.
అనుష్టుప్ఛందము.జ.ర.లగ.గణములు.వృ.సం.86.ప్రాసగలదు.
1.శమాంత కాంత కాంతులన్?        2.శతాయు వీయు సత్యమే?
   విమాన భ్రాంతి శోభినీ?                   పితుంగ నీయు క్షీరమున్?
  ప్రమోద మోద మోదమున్?            ప్రతీక.     జన్మ     ధన్యనీ?
  శ్రమంబుగాదు పొందగా!                వ్రతాను గుణ్య.  వర్తినిన్?

2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
శతకోటి సూర్య భాసి భా!
వెత లంట నీని జీవనీ!
వ్రత నిష్ట బ్రోచు భార్గవిన్?
చతురంతయాన భామినిన్?

3.గర్భగత"-భ్రాంతినీ"-వృత్తము.
అత్యష్టీ ఛందము.జ.ర.జ.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శమాంత కాంత కాంతులం?శత కోటి సూర్య భాసిభా?
విమాన భ్రాంతి శోభినీ?వెత లంట నీని జీవనీ!
ప్రమోద మోద మోదముం?వ్రత నిష్ట బ్రోచు భార్గవిన్?
శ్రమంబు కాదు పొందగా!చతురంత యాన భామినిన్?

4.గర్భగత"-ప్రతీక"-వృత్తము.
అత్యష్టీఛందము.స.జ.భ.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శత కోసూర్ర్య భాసి భా?శతాయువీయు సత్యమే?
వెతలంట నీని జీవనీ!పితుంగ నీయు క్షీరమున్?
వ్రత నిష్ట బ్రోచు భార్గవిం?ప్రతీక జన్మ ధన్యనీ!
చతురంత యాన భామినిం?వ్రతానుగుణ్య వర్తినిన్?

5.గర్భగత"-శతాయు"-వృత్తము.
అభికృతిఛందము.స.జ.భ.జ.ర.జ.ర.జ.గ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
శతకోటి సూర్య భాసిభా!శతాయువీయు సత్యమే!శమంత కాంత కాంతులన్?
వెత లంట నీని! జీవనీ! పితుంగ నీయు క్షీరముం?  విమాన భ్రాంతి శోభినీ?
వ్రత నిష్ట బ్రోచు భార్గవిం?ప్రతీక జన్మ ధన్యనీ! ప్రమోద మోద మోదమున్?
చతురంత యాన భామినిం?వ్రతాను గుణ్య వర్తినిం?శ్రమంబుకాదు పొందగా?

6.గర్భగత"-సత్యమేవ"-వృత్తము.
అష్టీఛందము.జ.ర.జ.ర.జ.గ.గణములు.యతి.9.,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శతాయు వీయు సత్యమే!శమంత కాంత కాంతులం?
పితుంగ నీయు క్షీరముం?విమాన భ్రాంతి శోభినీ?
ప్రతీక జన్మ ధన్యనీ!ప్రమోద మోద మోదమున్?
వ్రతానుగుణ్య వర్తినిం?శ్రమంబు కాదు పొందగా?

7.గర్భగత"-కోటిసూర్య"-వృత్తము.
అభికృతిఛందము.జ.ర.జ.ర.జ.భ.ర.జ.గ.గణములు.యతులు.9,17.
ప్రాసనీమముగలదు.
శతాయువీయు సత్యమే!శమంత కాంత కాంతులం?శతకోటి సూర్య భాసిభా?
పితుంగ నీయు క్షీరముం?విమాన భ్రాంతి  శోభినీ?వెత లంట నీని జీవనీ?
ప్రతీక జన్మ ధన్యనీ! ప్రమోద మోద మోదముం?వ్రత నిష్ట బ్రోచు భార్గవిన్?
వ్రతానుగుణ్య వర్తినిం?శ్రమంబు కాదు పొందగా!చతురంత యాన భామినిన్?

8.గర్భగత"-సూర్యభా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శతకోటి సూర్య భాసిభా?శమంత కాంత కాంతులన్?
వెత లంట నీని జీవనీ?  విమాన  భ్రాంతి  శోభినీ?
వ్రత నిష్ట బ్రోచు భార్గవిం?ప్రమోద మోద మోదమున్?
చతురంత యాన భామినిం?శ్రమంబు కాదు!పొందగా!

9.గర్భగత"-కాంతిలు"-వృత్తము.
అభికృతి ఛందము.స.జ.ర.జ.ర.జ.ర.జ.గ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
శతకోసూర్ర్య భాసిభా?శమంత కాంత కాంతులం?శతాయు వీయు సత్యమే?
వెత లంట నీని జీవనీ? విమాన భ్రాంతి శోభినీ? పితుంగ నీయు  క్షీరమున్? 
వ్రతనిష్ట బ్రోచు భార్గవిం?ప్రమోద మోద మోదముం?  ప్రతీక  జన్మ ధన్యనీ?
చతురంత యాన భామినిం?శ్రమంబు కాదు పొందగా!వ్రతానుగుణ్య వర్తినిన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.