జైశ్రీరామ్.
శ్లో. న రణే విజయాత్ శూరో అధ్యయనాత్ న చ పండితఃన వక్తా వాక్పటుత్వేన న దాతా చ అర్ధ దానతః
ఇంద్రియాణాం జయే శూరో ధర్మాచరతి పండితః
హిత ప్రయోక్తిభిః వక్తా దాతా సన్మాన దానతః
తే.గీ. యుద్ధ విజయుండు శూరుఁడా యిద్ధరిత్రి?
గ్రంథ పఠనఁ బండితుఁడుగా కాగలుగునె?
వాక్పటుత్వంబు కలిగినన్ వక్త యగునె?
ధనమొసంగిన మాత్రాన దాత యగునె?
తే.గీ. ఇంద్రియ జితుండె శూరుడౌ నెరుగ నిజము.
ధర్మ వర్తుఁడె సూరియౌ ధరణిపైన
హిత ప్రవక్తయె వక్తయౌ ననుపమ గతి.
తరళ సన్మాన దాతయే దాత. నిజము.
భావము. రణభూమి లో గెలుచినంత మాత్రం శురుడు కాలేడు,
నాలుగు గ్రంధాలు అధ్యయనం చేసినంతమాత్రాన పండితుడు కాలేడు,
అనర్ఘళంగా మాట్లాడినంత మాత్రాన వక్త అనిపించుకోడు,
ధనం వెచ్చించినంత మాత్రాన దాతా కాడు.
ఇంద్రయాలను జయించినవాడు శూరుడు,
ధర్మాన్ని ఆచరణలో పెట్టగలిగినవాడు పండితుడు,
హితోక్తులు చెప్పగలిగినవాడు వక్త,
చివరగా మాన గౌరవాలకు భంగం కలగకుండా సహాయం చేసేవాడు దాత.
జైహింద్.
1 comments:
నమస్కారములు
చక్కని సూక్తి ధన్య వాదములు. నిజంగానే మన సంస్కృతి మేలిమి బంగారమే
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.