జైశ్రీరామ్.
ఆర్జనా,సమాశ్రీ,మత్తర జినీ,నరభరజా,యతిర్నవసు గంధి,అశాంతి, కలతల,హానికర,దుర్మద,వ లనితీరు,గర్భ"-ప్రల్ల దాల"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-ప్రల్లదాల"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.భ.ర.జ.ర.జ.ర. లగ.గములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కులముబట్టి బీదంచును!కొల్లగొట్టి కోట్లుపెట్టి!కొంపలార్పు స్వేచ్ఛదేలనో?
బలముబట్టి యోటంచును!వల్లకాని తీర్పు నొప్పి!పంపకాల పెంపు నేర్చిరే?
తెలివిజూపి స్వార్ధంబున!తెల్లవారి తీరు మాడ్కి!తృంపనౌనె?పైకులంబులున్?
వలనితీరు సామ్యంబన!ప్రల్లదాల నీఱొనర్చి!వంప జూడ న్యాయమే?ధరన్!
వంప=వంగ జేయ(లొంగజేయ),తృంపనౌనె=తృంచివే యనగునా?
పంపకాలు=పంచుకొనుటలు.పెంపు=అభి వృద్ధి,ఉన్నతి
1గర్భగత"-ఆర్జనా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.భ.గణములు.వృ.సం. 408.ప్రాసగలదు.
కులము బట్టి బీదంచును!
బలము బట్టి యోటంచును!
తెలివి జూపి స్వార్ధంబున!
వలని తీరు సామ్యంబన?
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు. వృ.సం.171.ప్రాసనీమముగలదు.
కొల్లగొట్టి కోట్లు పెట్టి!
వల్లకాని తీర్పుననొప్పి?
తెల్లవారు తీరు మాడ్కి?
ప్రల్లదాల నీఱొనర్చి?
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం. 171.ప్రాసగలదు.
కొంపలార్పు స్వేచ్ఛ దేలనే?
పంపకాల పెంపు నేర్చిరే?
తృంపనౌనె?పైకులంబులున్?
వంప జూడ న్యాయమే?ధరన్!
4.గర్భగత"-నరభరజా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.ర.ర.జ.గల. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కులముబట్టి బీదంచును!కొల్లగొట్టి కోట్లు పెట్టి?
బలముబట్టి యోటంచును?వల్లకాని తీర్పు నొప్పి!
తెలివిజూపి స్వార్ధంబున!తెల్లవారి తీరు మాడ్కి!
వలని తీరు సామ్యంబన?ప్రల్లదాల నీఱొనర్చి?
5.గర్భగత"-యతిర్నవసుగంధి"-వృత్ తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ. గణములు.యతి.9,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
కొల్లగొట్టి కోట్లు పెట్టి!కొంపలార్పు స్వేచ్ఛదేలనే?
వల్ల కాని తీర్పు నొప్పి!పంపకాల పెంపు నేర్చిరే?
తెల్లవారు తీరు మాడ్కి!తృంపనౌనె?పైకులంబులున్?
ప్రల్లదాల నీఱొనర్చి!వంప జూడ!న్యాయమే?ధరన్!
6.గర్భగత"-అశాంతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.స.య. లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కొల్లగొట్టి కోట్లుపెట్టి!కొంపలార్పు స్వేచ్ఛదేలనే?కులము బట్టి బీదంచును?
వల్లకాని తీర్పు నొప్పి!పంపకాల పెంపు నేర్చిరే?బలము బట్టి యోటంచును?
తెల్లవారుతీరు మాడ్కి!తృంపనౌనె!పైకులంబులుం!తె లివిజూపి,స్వార్ధంబున!
ప్రల్లదాల నీఱొనర్చి!వంపజూడ!న్యాయమే!ధరం? వలనితీరు సామ్యంబన?
7.గర్భగత"-కలతల"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.భ.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కొంపలార్పు!స్వేచ్ఛదేలనే?కులము బట్టి బీదంచును?
పంపకాల పెంపు నేర్చిరే?బలముబట్టి యోటంచును?
తృంపనౌనె?పైకులంబులుం!తెలివి జూపి స్వార్ధంబున?
వంపజూడ!న్యాయమే ధరం?వలని తీరు సామ్యంబన?
8.గర్భగత"-హానికర"-వృత్తము.
ఉత్కృతఛందము.ర.జ.ర.న.ర.భ.ర.జ. గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కొంపలార్పు స్వేచ్ఛదేలనే?కులముబట్టి బీదంచును?కొల్లగొట్టి కోట్లుపెట్టి!
పంపకుల పెంపు నేర్చిరే?బలముబట్టి యోటంచును!వల్లకాని తీర్పునొప్పి!
తృంపనౌనె?పైకులంబులుం!తెలివిజూ పి స్వార్ధంబన?తెల్లవారుతీరు మాడ్కి!
వంపజూడ న్యాయమే ధరం?వలనితీరు సామ్యంబన?ప్రల్లదాల నీఱొనర్చి!
9.గర్భగత"-దుర్మద"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.య.లల. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కొల్లగొట్టి కోట్లుపెట్టి!కులముబట్టి బీదంచును?
వల్లకాని తీర్పు నొప్పి!బలముబట్టి యోటంచును?
తెల్లవారు తీరు మాడ్కి!తెలివి జూపి స్వార్ధంబున?
ప్రల్లదాల నీఱొనర్చి!వలని తీరు సామ్యంబన?
10,గర్భగత"-వలనితీరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.య.స.జ.ర. లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కొల్లగొట్టి కోట్లు పెట్టి!కులముబట్టి బీదంచును?కొంపలార్పు స్వేచ్ఛదేలనే?
వల్లకాని తీర్పునొప్పి!బలముబట్టి యోటంచును?పంపకుల పెంపు నేర్చిరే?
తెల్లవారుతీరు మాడ్కి!తెలివిజూపి!స్వార్ధంబున! తృంపనౌనె?పైకులంబులున్
ప్రల్లదాల నీఱొనర్చి!వలనితీరు సామ్యంబన?వంప జూప న్యాయమే!ధరన్?
స్వస్తి.
మూర్తి .జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.