గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జులై 2018, సోమవారం

నాణ్యతా,సదయా,సిరినిలయా,వణకు,వరాశ్రి,తొణికెడు,కనవేమి,వినని,గతిదవ్వు,వెత నిలయ,గర్భ"-దిగు విలువ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
నాణ్యతా,సదయా,సిరినిలయా,వణకు,వరాశ్రి,తొణికెడు,కనవేమి,వినని,గతిదవ్వు,వెత నిలయ,గర్భ"-దిగు విలువ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
"-దిగు విలువ"-వృత్తము.
 
ఉత్కృతిఛందము.న.న.భ.న.న.మ.స.స.లగ.గణములు.యతులు.10,19,
ప్రాసనీమముగలదు.
విలువలు దిగజార్చిన!వెతలకు నెలవౌ!నెంచం?వినరేల?జనంబులున్?
కలవరమగు జీవము!గతులకు!కడు దూరంబౌ?కనవేల?నిజంబునున్?
తులువలు ఘనులౌదురు!స్తుతిదములకు!తావేదీ?తొణకంజను జాగృతుల్?
బలమున పరమౌ!ధర!బ్రతుకు పరదాశ్యంబౌ?వణీకించకు భారతిన్?

1.గర్భగత"నాణ్యతా"-వృత్తము.
బృహతీఛందము.న.న.భ.గణములు.వృ.సం.448.ప్రాసగలదు.
విలువలు దిగజార్చిన!
కలవరమగు జీవము?
తులువలు ఘనులౌదురు!
బలమున పరమౌ! ధర?

2.గర్భగత"-సదయా"వృతత్తము.
బృహతీఛందము.న.న.మ.గణణులు.వృ.సం.64.ప్రాసగలదు.
వెతలకు నెలవౌ!నెంచన్?
గతులకు కడు దూరంబౌ?
స్తుతిదములకు తావేదీ?
బ్రతుకు పరదాశ్యంబౌ?

3.గర్భగత"-సిరి నిలయా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.లగ.గణములు.వృ.సం.92.ప్రాసగలదు.
వినరేల?జనంబులున్!
కనవేల?నిజంబునున్!
తొణకంజను జాగృతుల్?
వణికించకు భారతిన్?

4.గర్భగత"-వణకు"-వృత్తము.
ధృతిఛందము.న.న.భ.న.న.మ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
విలువలు దిగ జార్చిన!వెతలకు నెలవౌ నెంచన్?
కలవర మగు జీవము!గతులకు కడు దూరంబౌ?
తులువలు ఘను లౌదురు!స్తుతిదములకు తావేదీ?
బలమున పరమౌ ధర!బ్రతుకు పరుల దాస్యంబౌ?

5.గర్భగత"-పరాశ్రి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.మ.స.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వెతలకు నెలవౌ నెంచన్?వినరేల!జనంబులున్?
గతులకు కడుదూరంబౌ?కనవేల?నిజంబునున్?
స్తుతిదములకు తావేదీ?తొణకంజను జాగృతుల్?
బ్రతుకు పరుల దాస్యంబౌ?వణికించకు భారతిన్?

6.గర్భగత"-తొణికెడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.మ.స.స.జ.న.జ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
వెతలకు నెలవౌ నెంచం?వినరేల?జనంబులుం?విలువలు దిగ జార్చిన!
గతులకు కడు దూరంబౌ?కనవేల నిజంబునుం?కలవర మగు జీవము!
స్తుతిదములకు తావేది?తొణకంజను జాగృతుల్?తులువలు ఘనులౌదురు!
బ్రతుకు పరుల దాస్యంబౌ?వణికించకు భారతిం?బలమున పరమౌ ధర!

7.గర్భగత"-కనవేమి"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.న.జ.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వినరేల?జనంబులుం? విలువ దిగజార్చిన!
కనవేల నిజంబునుం?కలవర మగు జీవము!
తొణకంజను జాగృతుల్?తులువలు ఘనులౌదురు!
వణికించకు భారతిం?బలమున పరమౌ ధర!

8.గర్భగత"-వినని"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.న.జ.న.న.స.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
వినరేల?జనంబులుం?విలువ దిగజార్చిన!వెతలకు  నెలవౌ నెంచన్?
కనవేల?నిజంబునుం?కలవరమగుజీవము!గతులకు కడు దూరంబౌ?
తొణకంజను  జాగృతుల్?తులువలు ఘనులౌదురు!స్తుతిదములకు తావేదీ?
వణికించకు భారతిం?బలమున పరమౌ ధర!బ్రతుకు పరుల దాస్యంబౌ?

9.గర్భగత"-గతిదవ్వు"-వృత్తము.
ధృతిఛందము.న.న.మ.న.న.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వెతలకు నెలవౌ నెంచం? విలువలు దిగజార్చిన!
గతులకు కడు దూరంబౌ?కలవరమగు జీవము!
స్తుతిదములకు తావేదీ?తులువలు ఘను లౌదురు!
బ్రతుకు పరుల దాస్యంబౌ?బలమున పరమౌ ధర!

10.గర్భగత"-వెతనిలయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.మ.న.న.భ.స.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
వెతలకు నెలవౌ నెంచం?విలువలు దిగ జార్చిన!వినరేల?జనంబులున్?
గతులకు కడు దూరంబౌ?కలవరమగు జీవము!కనవేల?నిజంబునున్?
స్తుతిదములకు తావేదీ?తులువలు ఘనులౌదురు!తొణకంజను జాగృతుల్?
బ్రతుకు పరుల దాస్యంబౌ?బలమున పరమౌ ధర!వణికించకు భారతిన్?
స్వస్తి.


మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.