జైశ్రీరామ్.
సాదృశీ,సమాశ్రీ,మత్తర జినీ,రజోనరజ,యతిర్నవసు గంధి,స్వేచ్ఛా సంకిలి,
రజరారజన,భాతిభావ్య,ద్విరజభా,నాతి చర్య గర్భ"-రజినీకర"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
ఉత్కృతిఛందము.ర.జ.న.ర.జ.ర.జ.ర.ల గ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
అర్ధరాత్రి స్వేచ్ఛ మనది!హద్దుపద్దు లుండు నెట్లు?హాయి!నొందు భుక్త ముండునే?
నిర్ధనుండు వ్యర్ధుడయెను!నిద్దురేది?కంటినిండ!నేయమేది?స్వార్ధ వాకిలిన్!
అర్ధమున్నచాలు ఘనుడు?అద్దిరా!బలుండు,వాడె?ఆయవా ర మంద నేటికిన్
వర్ధమాన ఖ్యాతు డతడె!వద్దురా!యిలాంటి స్వేచ్ఛ!బాయుటే!సుఖంబు! °భారతీ!
1.గర్భగత"-సాదృశీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.న.గణములు.వృ.సం. 491.ప్రాసగలదు.
అర్ధరాత్రి స్వేచ్ఛ మనది!
నిర్ధనుండు వ్యర్ధు డయెను!
అర్ధమున్న చాలు!ఘనుడు!
వర్ధమాన ఖ్యాతు డతడె?.
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు. వృ.సం.171.ప్రాసగలదు.
హద్దుపద్దు లుండు నెట్లు?
నిద్దురేది?కంటి. నిండ?
అద్దిరా!బలుండు వాడె!
వద్దురా! యిలాంటి స్వేచ్ఛ?
,3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం. 171.ప్రాసగలదు.
హాయి నొందు భుక్త ముండునే?
నేయమేది?స్వార్ధ వాకిలిన్?
ఆయవార మంద నేటికిన్?
బాయుటే!సుఖంబు భారతీ!
4.గర్భగత"-రజోనరజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.న.ర.జ.గల. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అర్ధరాత్రి స్వేచ్ఛ మనది?హద్దుపద్దు లుండు నెట్లు?
నిర్ధనుండు వ్యర్ధు డయెను?నిద్దురేది?కంటినిండ!
అర్ధమున్న చాలు !ఘనుడు?అద్దిరా?బలుండు వాడె!
వర్ధమాన ఖ్యాతు డతడె?వద్దురా?యిలాంటి స్వేచ్ఛ!
5.గర్భగత"-యతిర్నవసుగంధి"-వృత్ తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
హద్దు పద్దు లుండు నెట్లు?హాయినొందు భుక్త ముండునే?
నిద్దురేది?కంటినిండ! నేయ మేది?స్వార్ధ వాకిలిన్?
అద్దిరా?బలుండు వాడె?ఆయవార మంద నేటికిన్?
వద్దురా?యెలాంటి స్వేచ్ఛ!బాయుటే!సుఖంబు భారతీ?
6.గర్భగత"-స్వేచ్ఛా సంకిలి"-వృత్తము
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.త. లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
హద్దుపద్దులుండు నెట్లు?హాయినొందు భుక్తముండునే?అర్ధరాత్రి స్వేచ్ఛ మనది!
నిద్దురేది?కంటినిండ!నేయమేది?స్ వార్ధ వాకిలిం?నిర్ధనుండు!వ్యర్ధుడయె ను!
అద్దిరా!బలుండు వాడె?ఆయవార మంద నేటికిం?అర్ధమున్నచాలు!ఘనుడు
వద్దురా!యిలాంటి స్వేచ్ఛ!బాయుటే!సుఖంబు భారతీ?వర్ధమానఖ్యాతు, డతడె?
7.గర్భగత"-రజరారజన"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.న.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
హాయినొందు భుక్త ముండునే?అర్ధరాత్రి స్వేచ్ఛ మనది?
నేయమేది? స్వార్ధ వాకిలిం?నిర్ధనుండు!వ్యర్ధు డయెను?
ఆయవార మంద నేటికిం?అర్ధమున్నచాలు!ఘనుడు?
బాయుటే!సుఖంబు భారతీ?వర్ధమాన ఖ్యాతుడతడె?
8.గర్భగత"-భాతిభావ్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.న.ర.జ. గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
హాయినొందు భుక్త ముండునే?అర్ధరాత్రి స్వేచ్ఛ మనది!హద్దుపద్దు లుండు నెట్లు?
నేయమేది,స్వార్ధ వాకిలిం?నిర్ధనుండు వ్యర్ధుడయెను?నిద్దురేది?కంటినిం డ!
ఆయవార మందనేటికిం?అర్ధమున్నచాలు!ఘనుడు ?అద్దిరా!బలుండు వాడె?
బాయుటే!సుఖంబు భారతీ!వర్ధమాన ఖ్యాతుడతడె?వద్దురా?యిలాంటి! స్వేచ్ఛ?
9.గర్భగత"-ద్విరజభా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.భ.లల.గము లు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
హద్దుపద్దులుండు నెట్లు?అర్ధరాత్రి స్వేచ్ఛమనది!
నిద్దురేది?కంటినిండ!నిర్ధనుండు !వ్యర్ధు డయెను!
అద్దిరా?బలుండు వాడె?అర్ధమున్న చాలు ఘనుడు?
వద్దురా!యిలాంటి!స్వేచ్ఛ?వర్ధమా న ఖ్యాతుడతడె?
10.గర్భగత"-నాతిచర్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.భ.స.జ. లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
హద్దు పద్దు లుండు నెట్లు?అర్ధ రాత్రి స్వేచ్ఛ మనది!హాయినొందు భుక్త ముండునే?
నిద్దురేది?కంటినిండ!నిర్ధనుండు వ్యర్ధుడయెను!నేయమేది!స్వార్ధ వాకిలిన్
అద్దిరా!బలుండు,వాడె?అర్ధమున్ నచాలు ఘనుడు,ఆయవారమందనేటికిన్?
వద్దురా!యిలాంటి!స్వేచ్ఛ?వర్ధమా న ఖ్యాతు డతడె?బాయుటే? సుఖము భారతీ!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.