గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జులై 2018, శనివారం

భ్రమక, సమాశ్రీ ,రనరా, అయోనిజ, రజ రాజస,అంటని, దరియని, మోహర,శ్రీరమ్య,చీకుచింత,గర్భ "-నిస్సహాయ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.

భ్రమక, సమాశ్రీ ,రనరా, అయోనిజ, రజ రాజస,అంటని, దరియని, మోహర,శ్రీరమ్య,చీకుచింత,గర్భ
"-నిస్సహాయ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-నిస్సహాయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.ర.ర.జ.ర.జ.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
మూడుకాళ్ళ ముసలివాడ!మోహరింప చీకుచింత!ముట్టరారు దరికెవ్వరున్?
వాడిపోవు నొడలు ఛాయ!పాహి!యన్న రక్షలేదు!వట్టమంచు నిన్ను చూడరే!
నేడొ రేపొ వెడలు వీడు!స్నేహ మేల? టందు రెల్ల!నెట్ట నెంతు రిహమందునన్?
తాడి నీడ తెర గటంచు!దాహమైన తీర్చ రారు!తట్టు కొందు వెట్టులో నరా?

1.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379.ప్రాసగలదు.
మూడుకాళ్ళ ముసలివాడ!
వాడిపోవు నొడలు ఛాయ!
నేడొ రేపొ వెడలు వీడు!
తాడి నీడ తెర గటంచు?

2.గర్భగత"-సమాశ్రీవృత్త్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
మోహరిింప చీకు చింత!
పాహి యన్న రక్ష లేదు!
స్నేహమేల?టందు రెల్ల!
దాహమైన తీర్చ రారు!

3.గర్భగత"-రనరా"-వృత్తము.
బృహతీఛందము.ర.న.ర.గణములు.వృ.సం.187.ప్రాసగలదు.
ముట్ట రారు దరి కెవ్వరున్?
వట్ట మంచు నిన్ను చూడరే!
నెట్ట నెంతు రిహ మందునన్?
తట్టు కొందు వెట్టులో నరా?

4.గర్భగత"-అయోనిజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మూడు కాళ్ళ ముసలివాడ!మోహరింప చీకు చింత?
వాడిపోవు నొడలుఛాయ!పాహి యన్న రక్ష లేదు!
నేడు రేపొ వెడలు వీడు!స్నేహ మేల?టందురెల్ల!
తాడి నీడ తెర గటంచు!దాహమైన తీర్చ రారు!

5.గర్భగత"-రజ రజస"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మోహరింప చీకు చింత!ముట్టరారు దరి కెవ్వరున్?
పాహి యన్న రక్ష లేదు!వట్టమంచు నిన్ను చూడరే?
స్నేహ మేల!టందు రెల్ల?నెట్ట నెంతు రిహమందునన్?
దాహమైన తీర్చ రారు!తట్టు కొందు వెట్టులో?నరా!

6.గర్భగత"-అంటని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.స.య.జ.న.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
మోహరింప చీకు చింత!ముట్టరారు దరికెవ్వరుం?మూడుకాళ్ళముసలివాడ! 
పాహి యన్న రక్ష లేదు!వట్టమంచు నిన్ను చూడరే?వాడిపోవు నొడలు ఛాయ!
స్నేహమేల టందు రెల్ల?నెట్ట నెంతు రిహమందునం?నేడొ!రేపొ!వెడలు వీడు!
దాహమైన తీర్చ రారు!తట్టు కొందు వెట్టులో?నరా!తాడి నీడ తెర గటంచు!

7.గర్భగత"-దరియని"-వృత్తము.
ధృతిఛందము.ర.న.ర.ర.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ముట్టరారు దరికెవ్వరుం?మూడు కాళ్ళ ముసలివాడ!
వట్టమంచు నిన్ను చూడరే?వాడి పోవు నోడలి ఛాయ!
నెట్ట నెంతు రిహ మందునం?నేడొ రేపొ వెడలు వీడు!
తట్టు కొందు వెట్టులో?నరా!తాడి నీడ తెర గటంచు?

8.గర్భగత"-మోహర"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.ర.ర.న.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ముట్టరారు దరి కెవ్వరుం?మూడుకాళ్ళ ముసలివాడ!మోహరింప చీకుచింత!
వట్టమంచు నిన్ను చూడరే?వాడిపోవు నొడలి ఛాయ!పాహియన్న రక్షలేదు?నెట్టనెంతు రిహమందునం?నేడొ రేపొ వెడలు వీడు!స్నేహమేల?టందు రెల్ల!తట్టుకొందు వెట్టులో?నరా!తాడినీడ తెరగటంచు?దాహమైన తీర్చ రారు!

9.గర్భగత"-శ్రీరమ్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.న.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాస నీమముగలదు.
మోహరింప చీకు చింత!మూడు కాళ్ళ ముసలివాడ!
పాహి యన్న రక్ష లేదు!వాడి పోవు నొడలి ఛాయ!
స్నేహమేల?టందు రెల్ల!నేడొ రేపొ వెడలు వీడు!
దాహమైన తీర్చ రారు!తాడి నీడ తెరగటంచు?

10,గర్భగత"-చీకు చింత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.న.ర.జ.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
మోహరింప చీకు చింత!మూడుకాళ్ళ ముసలివాడ!ముట్టరారు దరికెవ్వరున్?
పాహి!యన్న రక్ష లేదు?వాడిపోవు నొడలి ఛాయ!వట్టమంచు నిన్ను చూడరే? 
స్నేహ మేల టందురెల్ల!నేడొ రేపొ!వెడలు వీడు!నెట్టనెంతు రిహమందునన్?
దాహమైన తీర్చ రారు!తాడి నీడ తెరగటంచు?తట్టు కొందు వెట్టులో?నరా!
స్వస్తి,
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.