జైశ్రీరామ్.
మత్తరజినీకరద్వయ,శోభకా ,రజినీకరప్రియద్వయ,జం ట,ఛండశాసన,నిల్చునా,ఒం టరి,గర్భ"-పండంటి"ద్వ యవృత్తములు. రచన:- అప్పల నరసింహమూర్తి,వల్లభవఝల.జుత్తాడ.
"-పండంటి"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.త.ర.ల గ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
1.ఉండవేలు దెబ్బతిఉంటివే!ఒంటరైన పక్షి రాజమా!ఉన్నావె చావకుండగన్?
పండువంటి జన్మ మాసెనే!పంటచేలు చూడవైతివే!బన్నంబునంది చింతలన్?
ఛండశాసనుండు కాలుడే!జంటపక్షి ఒంటరాయెనే!చన్నీరువీడు మత్స్యమై!
గండుమీలు వేటగాండ్రులే!కంటికున్కు పట్టు నెన్నడో!కన్నంత మ్రింగనెంతురే?
2.ఒంటరైన పక్షిరాజము!ఉండవేలు దెబ్బ తింటివే!ఉన్నావె చావకుండగన్?
పంటచేలు చూడవైతివే!పండువంటి జన్మ మాసెనే!బన్నంబునంది చింతలన్!
జంటపక్షి ఒంటరాయెనే!ఛండశాసనుండు కాలుడే!చన్నీరువీడు మత్స్యమై!కంటికున్కు పట్టునెన్నడో!గండుమీలు వేటగాండ్రులే!కన్నంత మ్రింగనెంతురే?
1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్త ములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం. 171.ప్రాసగలదు.
1.ఉండవేలు దెబ్బతింటివే! 2.ఒంటరైన పక్షిరాజమా!
పండువంటి జన్మమాసెనే!. పంటచేలుచూడవైతివే!
ఛండశాసనుండు కాలుడే! జంటపక్షి ఒంటరాయెనే!
గండుమీలు వేటగాండ్రులే! కంటికున్కు పట్టు నెన్నడో!
2.గర్భగత"-శోభకా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.ర.లగ.గణములు.వృ .సం.85.ప్రాసగలదు.
ఉన్నావె!చావకుండగన్!
బన్నంబునంది చింతలన్?
చన్నీరు వీడు మత్స్యమై!
కన్నంత మ్రింగ నెంతురే!
3.గర్భగత"-రజినీకరప్రియద్వయ"-వృ త్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.య తి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.ఉండవేలు దెబ్బతింటివే ! ఒంటరైన పక్షి రాజమా!
పండువంటి జన్మమాసెనే! పంటచేలు చూడవైతివే!
ఛండశాసనుండు కాలుడే! జంటపక్షి ఒంటరాయెనే!
గండుమీలు వేటగాండ్రులే!కంటికున్కు పట్టు నెన్నడో?
2.ఒంటరైన పక్షి రాజమా!ఉండవేలు దెబ్బ తింటివే!
పంటచేలు చూడవైతివే!పండువంటి జన్మ మాసెనే!
జంటపక్షి ఒంటరాయెనే!ఛండశాసనుండు కాలుడే!
కంటికున్కు పట్టు నెన్నడో?గండుమీలు వేటగాండ్రులే!
4.గర్భగత"-జంట"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.త.ర.లగ.గణము లు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఒంటరైన పక్షిరాజమా!ఉన్నావె చావకుండగన్!
పంటచేలు చూడవైతివే!బన్నంబునంది చింతలన్?
జంటపక్షి ఒంటరాయెనే!చన్నీరువీడు మత్స్యమై!
కంటికున్న్కు పట్టు నెన్నడో!కన్నంత మ్రింగ నెంతురే!
5.గర్భగత"-ఛండశాసన"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.త.ర.య.జ.ర.ల గ.గణములు.యతులు10,18ముప్రాసనీమము గలదు.
ఒంటరైన పక్షిరాజమా!ఉన్నావె చావకుండగం?ఉండవేలు దెబ్బతింటివే!
పంటచేలు చూడవైతివే!బన్నంబునంది చింతలం?పండువంటి జన్మమాసెనే!
జంటపక్షి ఒంటరాయెనే!చన్నీరువీడు మత్స్యమై!ఛండశాసనుండు కాలుడే!
కంటికున్కు పట్టునెన్నడో!కన్నంత మ్రింగనెంతురే!గండుమీలు వేటగాండ్రులే?
6.గర్భగత"-నిల్చునా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.ర.య.జ.ర.లగ.గణము లు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఉన్నావె చావకుండగం!ఉండవేలు దెబ్బతింటివే!
బన్నంబునంది చింతలం!పండువంటి జన్మమాసెనే!
చన్నీరు వీడుమత్స్యమై!ఛండశాసనుండు కాలుడే!
కన్నంత మ్రింగ నెంతురే!గండుమీలు వేటగాండ్రులే?
7గర్భగత"-ఒంటరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.ర.య.జ.ర.య.జ.ర.ల గ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ఉన్నావె చావకుండగం!ఉండవేలు దెబ్బతింటివే?ఒంటరైన పక్షిరాజమా!
బన్నంబునందిచింతలం?పండువంటి జన్మమాసెనే!పంటచేలు చూడవైతివే!
చన్నీరువీడు మత్స్యమై!ఛండశాసనుండు కాలుడే!జంటపక్షి ఒంటరాయెనే!
కన్నంత మ్రింగ నెంతురే!గండుమీలు వేటగాండ్రులే!కంటికున్కుపట్టునె న్నడో?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.