గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఏప్రిల్ 2018, సోమవారం

భాసస్వర,ధనామోహ,సమజా,భవహర,దివురు,తిలక,సలలిత,శ్యామలా,రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
భాసస్వర,ధనామోహ,సమజా,భవహర,దివురు,తిలక,సలలిత,శ్యామలా,
శ్వేతా,కరుణవల్లి,గర్భ -"సుఖదా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

             -"సుఖదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.భ.స.స.న.య.త.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
తెల్లటి స్ఫటిక లింగము!దివిరెన్నిడు పుండ్రము!తిలకుండై!జుత్తాడవెల్సె!
పల్లెకు శుభకరంబన?భవ దూరము చేయుచు!బలె!గాచు మల్లేశ్వరుండు!
చల్లగ జనుల గాచుచు!జవమున్శతమాయువు!సలిలంబుల్సశ్యంబొసంగి!
వల్లెగ?కరుణజూపును!భవి!సౌఖ్యమునీయును!భళెయౌ!దైవంబో?యనంగ!

1.గర్భగత"భాసస్వర"-వృత్తము.
బృహతీఛందము.భ.న.భ.గణములు.వృ.సం.447.ప్రాసగలదు.
తెల్లటి స్ఫటిక లింగము!
పల్లెకు శుభ కరంబన?
చల్లగ జనుల గాచుచు
వల్లెగ కరుణ జూపును!

2.గర్భగత"-ధనామోహ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.లల.గణములు.వృ.సం.220.ప్రాసగలదు.
దివిరెన్నిడు పుండ్రము!
భవ దూరము జేయుచు?
జవమున్శత మాయువు!
భవిసౌఖ్యము నీయును!

3.గర్భగత"-సమజా"-వృత్తము.
బృహతీఛందము.స.మ.జ.గణములు.వృ.సం.324.ప్రాసగలదు.
తిలకుండై!జుత్తాడ వెల్సె!
బలె!గాచున్మల్లేశ్వరుండు!
సలిలంబుల్సశ్యంబొసంగి!
భళెయౌ?దైవంబో?యనంగ!

4.గర్భగత"-భవహర"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.భ.స.స.లల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తెల్లటి స్ఫటిక లింగము!దివిరెన్నిడుపుండ్రము?
పల్లెకు శుభకరంబన?భవదూరము జేయుచు?
చల్లగ జనుల గాచుచు!జవమున్శత మాయువు?
వల్లెగ కరుణ జూపును!భవిసౌఖ్యము నీయును!

5.గర్భగత"-దివురు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.న.య.త.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమము గలదు!
దివిరెన్శిడు పుండ్రము!తిలకుండై?జుత్తాడ వెల్సె?
భవ!దురము జేయుచు!బలె?గాచున్మల్లేశ్వరుండు?
జవమున్శతమాయువు!సలిలంబుల్సశ్యంబొసంగి?
భవి!సౌఖ్యము నీయును!భళెయౌ!దైవంబో?యనంగన్?

6.గర్భగత"-తిలక"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.న.య.త.ర.న.స.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
దివిరెన్నిడు!పుండ్రము!తిలకుండై!జుత్తాడ వెల్సె?తెల్లటి!స్ఫటిక లింగము!
భవ!దూరము జేయుచు!బలె?గాచున్మల్లేశ్వరుండు?పల్లెకు!శుభకరంబన?
జవమున్శతమాయువు!సలిలంబుల్సశ్యంబొసంగి!చల్లగ!జనుల గాచుచు?
భవి!సౌఖ్యము నీయును!భళెయౌ!దైవంబో?యనంగ!వల్లెగకరుణ!జూపును!

7.గర్భగత"-సలలిత"-వృత్తము.
ధృతిఛందము.స.మ.జ.భ.న.భ.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తిలకుండై!జుత్తాడ వెల్సె?తెల్లటి!స్ఫటిక లింగము!
బలె?గాచున్మల్లేశ్వరుండు?పల్లెకు!శుభకరంబన?
సలిలంబుల్సశ్యంబొసంగి!చల్లగ!జనుల!గాచుచు?
భళెయౌ?దైవంబో?యనంగ!వల్లెగ!కరుణజూపును!

8.గర్భగత"-శ్యామలా"-వృత్తము
ఉత్కృతిఛందము.స.మ.జ.భ.న.భ.స.స.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
తిలకుండై!జుత్తాడ వెల్సె?తెల్లటి!స్ఫటిక లింగము!దివిరెన్నిడు పుండ్రము!
బలె?గాచున్మల్లేశ్వరుండు?పల్లెకు!శుభకరంబన?భవ!దూరము జేయుచు!
సలిలంబుల్సశ్యంబొసంగి!చల్లగ!జనుల!గాచుచు?జవమున్శత మాయువు!
భళెయౌ?దైవంబో?యనంగ!వల్లెగ!కరుణజూపును!భవి!సౌఖ్యము!నీయును?

9.గర్భగత"-శ్వేతా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.స.న.స.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
దివిరెన్నిడు పుండ్రము!తెల్లటి!స్ఫటిక లింగము!
భవ దూరము జేయుచు!పల్లెకు!శుభకరంబన?
జవమున్శతమాయువు!చల్లగ!జనుల!గాచుచు?
భవి!సౌఖ్యము!నీయును?వల్లెగ?కరుణ!జూపును!

10.గర్భగత"-కరుణవల్లి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.స.న.స.న.య.త.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
దివిరెన్నిడు పుండ్రము!తెల్లటి!స్ఫటిక!లింగము!తిలకుండై!జుత్తాడ!వెల్సె?
భవదురము!జేయుచు!పల్లెకు!శుభకరంబన!బలె?గాచున్మల్లేశ్వరుండు?
జవమున్శత మాయువు!చల్లగ!జనుల!గాచుచు?సలిలంబుల్సశ్యంబొసంగి?
భవిసౌఖ్యమునీయును?వల్లెగ! కరుణజూపును!భళెయౌ?దైవంబో?యనంగ?
స్వస్తి.
మూర్తి . జుత్తాడ.   
జైహింద్.         
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" తెల్లటి స్పటిక లింగము " దివిరెన్నిడు పుండ్రము " పద్యము లన్నియు రసరమ్యముగా నున్నవి . ధన్య వాదములు .అందించిన సోదరులకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.