జైశ్రీరామ్
జుత్తాడ.కలినింద,గర్భ-"రాజీవ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
" రాజీవ " వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.ర.జ.ర.న.ర.ల గ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కల్లబొల్లి కబురు లాడి!కట్టుదప్పి నీతినీమముల్!కలి"-కి!నిందమోపుచు న్?
చెల్లుబాటు తమకు కాగ!చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్!చెలిమి!బల్మినుల్ముచు న్?
జల్లునేలకురియకున్న?చట్ట"సానుకూ ల్య!మార్పులం!చలితబుద్ధి!నేర్చు చున్?
తల్లి!గర్భగతము!పొంద!దట్టమౌనె?భా విజీవముల్!తలపరై రదేలనో?
కలి=కల్యవతారము,జల్లు=వానజల్లు, చలితబుద్ధి=అస్థిరజ్ఞానము,
చట్టసానుకూల్య=శాశనములు వారికనుకూలముగ,తల్లిగర్భగత=
భూమాత గర్భముదుగల,మణిమాదులు,(ప్రకృతి వనరులు).
1.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం. 379ప్రాసనగలదు.
కలబొల్లి!కబురు లాడి!
చెల్లుబాటు!తమకు!కాగ?
జల్లు నేల!కురియకున్న?
తల్లి!గర్భ గతము!పొంద?
2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం. 171.ప్రాసగలదు.
కట్టుదప్పి!నీతి నీమముల్?
చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్!
చట్టసానుకూల్య మార్పులన్!
దట్ట!మౌనె?భావి జీవముల్!
3.గర్భగత"-అనఘా"- వృత్తము.
అనుఅప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం .88.ప్రాసగలదు.
కలి"-కి!నింద మోపుచున్?
చెలిమి!బల్మి నుల్ముచున్!
చలిత!బుద్ధి నేర్చుచున్!
తలప!రై ,రదేలనో?
4.గర్భగత"-పాత్రతా"-వృత్తము.
ధృతిఛందము.ర.న.జ.ర.జ.ర.గణములు.య తి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కల్లబొల్లి కబురులాడి!కట్టుదప్పి నీతినీమముల్?
చెల్లుబాటు!తమకు కాగ!చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్?
జల్లు నేల కురియకున్న?చట్ట సానుకూల్య మార్పులన్!
తల్లి గర్భగతము!పొంద!దట్టమౌనె?భావి జీవముల్!
5.గర్భగత"-రజరోన్నర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.ర.లగ.గణము లు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కట్టుదప్పి!నీతినీమముల్?కలి"కి! నిందమోపుచున్?
చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్?చెలిమి!బల్మి నుల్ముచున్?
చట్ట!సానుకూల్య మార్పులం?చలిత బుద్ధి!నేర్చుచున్?
దట్ట మౌనె?భావిజీవముల్? దలప రై రదేలనో?
6.గర్భగత"-సురశోభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.య.జ.న.గ ల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కట్టుదప్పి!నీతినీమముల్కలి"కి!నిం దమోపుచున్?కల్లబొల్లి!కబురులాడి !
చెట్టపట్టి!నీర్ష్యద్వేషముల్?చె లిమి!బల్మి నుల్ముచుం?చెల్లుబాటు!తమకుకాగ!
చట్ట సానుకూల్యమార్పులం?చలిత బుద్ధి నేర్చుచుం?జల్లునేల కురియకున్న?
దట్టమౌనె?భావిజీవముల్?దలప రై రదేలనో?తల్లి గర్భగతము పొంద?
7.గర్భగత"-వేమరు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.న.గల.గణము లు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలి"కి!నింద మోపుచుం?కల్లబొల్లి కబురు లాడి!
చెలిమి!బల్మి నుల్ముచుం?చెల్లుబాటుతమకు!కాగ?
చలిత బుద్ధినేర్చుచుం?జల్లు నేల కురియ కున్న?
తలప రై రదేలనో?తల్లి గర్భగతము పొంద?
8.గర్భగత"-బీజాపూర్ణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.న.ర.జ.ర. లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కలి"కి!నిందమోపుచుం?కల్లబొల్లి కబురులాడి!కట్టు తప్పి!నీతినీమముల్?
చెలిమి బల్మి నుల్ముచుం?చెల్లుబాటు!తమకుకాగ! చెట్టపట్టి!నీర్ష్యద్వేషముల్!
చలిత బుద్ధి!నేర్చుచుం?జల్లు నేల కురియ కున్న?చట్టసానుకూల్యమార్పులన్
తలపరై రదేలనో?తల్లిగర్భగతము!పొంద!దట్ టమౌనె?భావి జీవముల్?
9.గర్భగత"-గర్భగత"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.న.జ.గణములు. యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
కట్టుదప్పి!నీతినీమముల్?కల్లబొ ల్లి!కబురులాడి!
చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్?చెల్లుబాటు!తమకు!కాగ?
చట్టసానుకూల్య!మార్పులం?జల్లు నేల కురియకున్న?
దట్టమౌనె?భావి జీవముల్?తల్లిగర్భగతము పొంద?
10.గర్భగత"-కలినింద"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.జ.న.ర. లగ.గణములు యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కట్టుదప్పి నీతినీమముల్?కల్లబొల్లి కబురులాడి!కలి"-కి!నిందమోపుచున్ ?
చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్?చెల్లుబాటు!తమకు!కాగ! చెలిమి బల్మినుల్ముచున్
చట్ట సానుకూల్య!మార్పులం?జల్లు నేలకురియకున్న?చలిత బుద్ధి నేర్చుచున్
దట్టమౌనె?భావిజీవముల్?తల్లిగర్ భగతము!పొంద?తలప రై రదేలనో?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
1 comments:
guruvulaku pranamamulu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.